Business News: ఎన్నికల వేళ.. అద్దెకు హెలికాప్టర్, చార్టర్డ్ ఫ్లైట్..! గంటకు అద్దె ఎంతో తెలుసా..?

|

Mar 14, 2024 | 8:29 AM

ఐదేళ్లకు ఒకసారి జరిగే ఎన్నికలకు భారీగా ఖర్చు చేసే రాజకీయ పార్టీలు,.. ఎన్నికలకు నెల రోజుల ముందు ప్రచారం చేసేవారు. అయితే ఇప్పుడు అద్దెకు హెలికాప్టర్లు, చార్టర్డ్ విమానాలు అందుబాటులోకి రావడంతో నోటిఫికేషన్ వచ్చిన తర్వాతే విస్తృత ప్రచారం మొదలుపెడుతున్నారు. ఎన్నికల కోసం పార్టీల ఖర్చులకు..

Business News: ఎన్నికల వేళ.. అద్దెకు హెలికాప్టర్, చార్టర్డ్ ఫ్లైట్..! గంటకు అద్దె ఎంతో తెలుసా..?
Helicopter For Rent
Follow us on

ప్రస్తుతం దేశంలో ఎన్నికల సీజన్ నడుస్తోంది. ఒకవైపు పార్లమెంటు ఎన్నికలు, మరోవైపు పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అందుకే రాజకీయ పార్టీలు ట్రెండ్ మార్చాయి. తక్కువ సమయంలో ఎక్కువ ప్రచారం చేసేందుకు వీలుగా పార్టీలు కొత్త మార్గాలను ఎంచుకుంటున్నాయి. మరీ ముఖ్యంగా ఎన్నికల బరిలో నిలిచే రాజకీయ నాయకులకు, ప్రధాన పార్టీల ముఖ్య నేతలకు ప్రచారం సవాల్‌గా మారింది. చాలా పార్టీలు తక్కువ సమయంలో ఎక్కువ నియోజకవర్గాలు, అసెంబ్లీలను కవర్ చేయాలని ప్లాన్ చేస్తున్నాయి. జాతీయ పార్టీల నుంచి ప్రాంతీయ పార్టీల వరకు చాలా మంది నేతలు తమ ఎన్నికల ప్రచారానికి హెలికాప్టర్లు ఎక్కి ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. దీంతో హెలికాప్టర్లకు డిమాండ్ పెరగడంతో పాటు అద్దె కూడా భారీగా పెరిగింది.

ఎన్నికల నేపథ్యంలో చార్టర్డ్ విమానాలు, హెలికాప్టర్లకు డిమాండ్ పెరిగింది. ప్రస్తుతం చార్టర్డ్ విమానానికి గంటకు రూ.4.5 లక్షల నుంచి రూ.5.25 లక్షల వరకు వసూలు చేస్తున్నారు. అలా అయితే చార్టర్డ్ విమానాల అద్దె, హెలికాప్టర్‌కు గంటకు 1.5 లక్షల నుంచి రూ. 3.5 లక్షల వరకు వసూలు చేస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం దేశంలో 350 చార్టర్డ్ విమానాలు, 175 హెలికాప్టర్లు ఉన్నాయి.

ఐదేళ్లకు ఒకసారి జరిగే ఎన్నికలకు భారీగా ఖర్చు చేసే రాజకీయ పార్టీలు,.. ఎన్నికలకు నెల రోజుల ముందు ప్రచారం చేసేవారు. అయితే ఇప్పుడు అద్దెకు హెలికాప్టర్లు, చార్టర్డ్ విమానాలు అందుబాటులోకి రావడంతో నోటిఫికేషన్ వచ్చిన తర్వాతే విస్తృత ప్రచారం మొదలుపెడుతున్నారు. ఎన్నికల కోసం పార్టీల ఖర్చులకు ఈసారి చార్టర్డ్ ఫ్లైట్, హెలికాప్టర్ అద్దె కూడా తోడైంది. ప్రచార బడ్జెట్ కూడా భారీగానే ఉంటుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి