HDFC Home Loans: తగ్గిన హోమ్ లోన్ వడ్డీ రేటు.. హెచ్డీఎఫ్సీ బ్యాంకు వినియోగదారులకు మంచి చాన్స్..

|

Jun 10, 2024 | 5:23 PM

ఆర్బీఐ రెపో రేటును యథాతథంగా కొనసాగించింది. వరుసగా ఎనిమిదో సారి ఆర్బీఐ రెపో రేటును అదే విధంగా కొనసాగించింది. ఈ క్రమంలో హెచ్ డీఎఫ్సీ తన వడ్డీ రేట్లను సవరించింది. ముఖ్యంగా గృహ రుణాలపై వడ్డీ రేట్లను తగ్గించింది. దీనిని మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్- బేస్డ్ లెండింగ్ రేట్స్(ఎంసీఎల్ఆర్) అని పిలుస్తారు. ఈ మార్పులేంటి? దాని వల్ల వినియోగదారులపై ప్రభావం ఎలా ఉంటుంది?

HDFC Home Loans: తగ్గిన హోమ్ లోన్ వడ్డీ రేటు.. హెచ్డీఎఫ్సీ బ్యాంకు వినియోగదారులకు మంచి చాన్స్..
Hdfc Bank
Follow us on

హోమ్ లోన్ తీసుకోవాలనుకునే వారికి గుడ్ న్యూస్. ప్రముఖ ప్రైవేటు బ్యాంకు అయిన హెచ్డీఎఫ్సీ ఈ హోమ్ లోన్లపై వడ్డీ రేట్లను తగ్గించింది. ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) ఎంపీసీ సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో ఆర్బీఐ రెపో రేటును యథాతథంగా కొనసాగించింది. వరుసగా ఎనిమిదో సారి ఆర్బీఐ రెపో రేటును అదే విధంగా కొనసాగించింది. ఈ క్రమంలో హెచ్ డీఎఫ్సీ తన వడ్డీ రేట్లను సవరించింది. ముఖ్యంగా గృహ రుణాలపై వడ్డీ రేట్లను తగ్గించింది. దీనిని మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్- బేస్డ్ లెండింగ్ రేట్స్(ఎంసీఎల్ఆర్) అని పిలుస్తారు. ఈ మార్పులేంటి? దాని వల్ల వినియోగదారులపై ప్రభావం ఎలా ఉంటుంది? కొత్త వడ్డీ రేట్లు ఎప్పటి నుంచి అమలులోకి వస్తాయి? తెలుసుకుందాం రండి..

హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కొత్త ఎంసీఎల్ఆర్..

హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తన ఎంసీఎల్ఆర్ ను ప్రకటించింది. ఇది బ్యాంకు అధికారిక వెబ్ సైట్ ప్రకారం జూన్ ఏడో తేదీ నుంచి అమలులోకి వచ్చింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వరుసగా ఎనిమిదోసారి రెపో రేటును యథాతథంగా ఉంచాలని నిర్ణయించడంతో బ్యాంకు ఈ నిర్ణయం తీసుకుంది.

కొత్త మార్పులు ఇవే..

2 సంవత్సరాల పదవీకాలంపై ఎంసీఎల్ఆర్.. హెచ్ఐఎఫ్సీ బ్యాంక్ 2 సంవత్సరాల పదవీకాలంలో రుణ రేటును 5 బేసిస్ పాయింట్లు (బీపీఎస్) తగ్గించింది. దానిని 9.35 శాతం నుంచి 9.30 శాతానికి తగ్గించింది. ఫలితంగా, అదే కాలవ్యవధికి గృహ రుణ రేట్లు తగ్గుతాయి. అయితే ఇతర కాల వ్యవధిలపై ఎంసీఎల్ఆర్ ను బ్యాంక్ మార్చలేదు. యథావిధిగాక కొనసాగించింది.

బ్యాంక్ బెంచ్ మార్క్ ఎంసీఎల్ఆర్ ఇప్పుడు 8.95 శాతం నుంచి 9.35 శాతం మధ్య ఉంది. ఇది వినియోగదారులను ఎలా ప్రభావితం చేస్తుందనే విషయాన్ని గమనిస్తే.. ఈ ఎంసీఎల్ఆర్ రివిజన్ల ప్రభావం తక్షణమే ఉండదని నిపుణులు చెబుతున్నారు. ఎంసీఎల్ఆర్-ఆధారిత గృహ రుణాల కోసం రీసెట్ వ్యవధి ఉంది, ఆ తర్వాత రుణగ్రహీతల కోసం రేట్లు సవరణ చేసే అవకాశం ఉంది.

ఎంసీఎల్ఆర్ అంటే ఏమిటి?

మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్- బేస్డ్ లెండింగ్ రేట్స్(ఎంసీఎల్ఆర్) అంటే బ్యాంక్ డబ్బును రుణంగా ఇవ్వగల కనీస వడ్డీ రేటు. ఇది బ్యాంక్ నిధుల ఖర్చు, నిర్వహణ ఖర్చులు, పదవీకాల ప్రీమియం వంటి అంశాల ఆధారంగా నిర్ణయించబడుతుంది. తక్కువ ఎంసీఎల్ఆర్ అంటే సాధారణంగా తక్కువ ఈఎంఐలు లేదా తక్కువ లోన్ కాల వ్యవధి.

ఆర్బీఐ నిర్ణయాల ప్రభావం..

పాలసీ రేట్లపై ఆర్బీఐ అప్రమత్తమైన వైఖరిని కొనసాగిస్తున్నందున, కొంత కాలం పాటు రుణ ఖర్చులు సాపేక్షంగా ఎక్కువగానే ఉండవచ్చని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణం ఆర్బీఐ లక్ష్యాలతో సరితూగే స్థాయికి తగ్గిన తర్వాత, ఆర్బీఐ రేట్ల తగ్గింపును పరిగణించవచ్చని చాలా మంది ఆర్థికవేత్తలు భావిస్తున్నారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..