
HDFC Bank: దేశంలోని ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంకులలో ఒకటైన HDFC Bank తన ఖాతాదారులకు ముఖ్యమైన ప్రకటన చేసింది. యూపీఐ (UPI) ఆధారితంగా ఏటీఎంల నుంచి నగదు ఉపసంహరణ చేసే లావాదేవీలను ఇకపై నెలవారీ ఉచిత ఏటీఎం ట్రాన్సాక్షన్‌ల పరిమితిలోనే లెక్కించనున్నట్లు బ్యాంకు తెలిపింది. ఈ కొత్త నిబంధన 2026 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానుంది.
కొత్త మార్పు ఏమిటి?
ఇప్పటి వరకు యూపీఐ ద్వారా కార్డ్ లేకుండా ఏటీఎంలలో నగదు తీసుకునే లావాదేవీలు వేరుగా పరిగణించేది. అయితే కొత్త మార్పు ప్రకారం, యూపీఐ క్యాష్ విత్‌డ్రాయల్స్ కూడా సాధారణ ఏటీఎం ఉపసంహరణలతో కలిపి నెలవారీ ఉచిత ట్రాన్సాక్షన్‌లలో భాగంగా లెక్కిస్తారు. బ్యాంకు కస్టమర్లకు పంపిన సమాచారంలో యూపీఐ క్యాష్ విత్‌డ్రాయల్స్ మీ నెలవారీ ఉచిత ఏటీఎం ట్రాన్సాక్షన్‌ల పరిమితిలో భాగంగా పరిగణించనున్నట్లు పేర్కొంది.
ఉచిత పరిమితి దాటితే ఛార్జీలు:
నెలకు అనుమతించిన ఉచిత ట్రాన్సాక్షన్‌ల సంఖ్య పూర్తయిన తరువాత ప్రతి అదనపు నగదు ఉపసంహరణపై రూ.23 + జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుందని బ్యాంకు వెల్లడించింది.
ప్రస్తుతం ఉన్న ఉచిత పరిమితి:
సేవింగ్స్, జీత ఖాతాల కోసం ప్రస్తుతం ఉన్న నిబంధనలు ఇలా ఉన్నాయి:
ఇతర బ్యాంకుల ఏటీఎంలలో:
లావాదేవీలపై ఛార్జీల వ్యవస్థను అన్ని ఛానళ్లలో ఒకే విధంగా ఉంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు బ్యాంకు తెలిపింది. పారదర్శకత, సమానమైన ఛార్జీల విధానాన్ని అమలు చేయడం లక్ష్యమని వెల్లడించింది.
యూపీఐ ఏటీఎం విత్‌డ్రాయల్ అంటే ఏమిటి?
యూపీఐ ఆధారిత ఏటీఎం ఉపసంహరణలో డెబిట్ కార్డు అవసరం ఉండదు. ఏటీఎం స్క్రీన్‌పై కనిపించే QR కోడ్‌ను మొబైల్‌లోని యూపీఐ యాప్‌తో స్కాన్ చేసి, పిన్ ద్వారా అనుమతి ఇవ్వడం ద్వారా నగదు పొందవచ్చు. కార్డ్‌లెస్ బ్యాంకింగ్‌ను ప్రోత్సహించే భాగంగా ఈ సదుపాయం దేశవ్యాప్తంగా దశలవారీగా విస్తరిస్తోంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి