బ్యాంక్‌ కస్టమర్లకు బిగ్‌ అలర్ట్‌.. ఆ బ్యాంకు సేవలన్నీ బంద్‌! ఎప్పటి నుంచి ఎప్పటి వరకంటే..?

హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ డిజిటల్ సేవలు (ఇంటర్నెట్ బ్యాంకింగ్, యూపీఐ) సిస్టమ్ నిర్వహణ కారణంగా ఈ నెల 21న అర్ధరాత్రి 2:30 నుండి 5:30 వరకు తాత్కాలికంగా నిలిచిపోనున్నాయి. డిజిటల్ చెల్లింపులపై ఆధారపడే కస్టమర్లు నగదు సిద్ధం గా ఉంచుకోవాలని బ్యాంక్ సూచించింది.

బ్యాంక్‌ కస్టమర్లకు బిగ్‌ అలర్ట్‌.. ఆ బ్యాంకు సేవలన్నీ బంద్‌! ఎప్పటి నుంచి ఎప్పటి వరకంటే..?
Bank

Updated on: Dec 18, 2025 | 9:27 PM

ప్రస్తుతం అంతా డిజిటల్‌ వరల్డ్‌గా మారిపోతుంది. ముఖ్యంగా బ్యాంకింగ్‌ వ్యవస్థ అయితే పూర్తి డిజిటల్‌ అయిపోతుంది. చాలా మంది తమ ఫోన్‌లోనే అన్ని పనులు చక్కబెట్టేస్తున్నారు. ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌తో పాటు యూపీఐ వచ్చిన తర్వాత డిజిటల్‌ చెల్లింపులు గణనీయంగా పెరిగిపోయాయి. జనాలు తమ జేబుల్లో డబ్బులు పెట్టుకోవడమే మర్చిపోయారు. యూపీఐ పైనే ఎక్కువగా ఆధారపడుతున్నారు.

అలా ఎక్కువగా డిజిటల్‌ పేమెంట్స్‌పై ఆధారపడిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ కస్టమర్లకు బిగ్‌ అలర్ట్‌. అదేంటంటే.. హెడ్‌డీఎఫ్‌సీకి సంబంధించి అన్ని సేవలు కొన్ని గంటల పాటు నిలిచిపోనున్నాయి. ఈ నెల 21న అర్ధరాత్రి 2.30 గంటల నుంచి తెల్లవారుజామున 5.30 గంటల వరకు బ్యాంకుకు సంబంధించిన అన్ని సేవలు నిలిపివేయనున్నారు.

సిస్టమ్‌ మేయిటెనెన్స్‌లో భాగంగా మొత్తం 3 గంటల పాటు అన్ని సేవలు నిలిపివేస్తున్నట్లు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ తెలిపింది. అయితే ఆ సమయంలో ఎవరు కూడా పెద్దగా చెల్లింపులు ఏమి జరపరు కనుక.. దూరపు ప్రయాణాలు చేసేవారు, చికిత్స పొందుతూ ఆస్పత్రిలో ఉన్నవారు మాత్రం కొంత నగదును ముందుగానే చేతిలో పెట్టుకుంటే మంచిది. అయితే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌కు చెందిన పేజ్యాప్‌ యాప్‌ నుంచి చెల్లింపులు చేయవచ్చని బ్యాంక్‌ తెలిపిందే.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి