HDFC Bank: మీకు ఈ బ్యాంకులో ఖాతా ఉంటే జాగ్రత్తగా ఉండండి.. లేకపోతే భారీగా మోసపోతారు

|

Mar 04, 2023 | 3:07 PM

ఈ డిజిటల్‌ ప్రపంచంలో మోసాలు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా బ్యాంకింగ్‌ రంగంలో రకరకాల మోసాలు జరుగుతున్నాయి. వినియోగదారులకు ఫోన్‌, మెసేజ్‌ల రూపంలో లింక్‌లను పంపిస్తూ వారిని నిలువునా దోచుకుంటున్నారు. టెక్నాలజీ పెరుగుతున్న కారణంగా దుండగులు కొత్త కొత్త ట్రాక్‌లను ఎంచుకుంటున్నారు. ప్రజలు ఎక్కువగా ఆన్‌లైన్ లావాదేవీలు చేయడం ప్రారంభించడంతో మోసం చేసే పద్ధతులు కూడా ఆన్‌లైన్‌లోకి వచ్చాయి. ఒక్కోసారి కార్డ్ బ్లాక్ పేరుతో, ఇంకొన్నిసార్లు లాటరీ పేరుతో అమాయకుల కష్టార్జిత సొమ్ము మాయమైపోతోంది. అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంకు […]

HDFC Bank: మీకు ఈ బ్యాంకులో ఖాతా ఉంటే జాగ్రత్తగా ఉండండి.. లేకపోతే భారీగా మోసపోతారు
cyber crime
Follow us on

ఈ డిజిటల్‌ ప్రపంచంలో మోసాలు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా బ్యాంకింగ్‌ రంగంలో రకరకాల మోసాలు జరుగుతున్నాయి. వినియోగదారులకు ఫోన్‌, మెసేజ్‌ల రూపంలో లింక్‌లను పంపిస్తూ వారిని నిలువునా దోచుకుంటున్నారు. టెక్నాలజీ పెరుగుతున్న కారణంగా దుండగులు కొత్త కొత్త ట్రాక్‌లను ఎంచుకుంటున్నారు. ప్రజలు ఎక్కువగా ఆన్‌లైన్ లావాదేవీలు చేయడం ప్రారంభించడంతో మోసం చేసే పద్ధతులు కూడా ఆన్‌లైన్‌లోకి వచ్చాయి. ఒక్కోసారి కార్డ్ బ్లాక్ పేరుతో, ఇంకొన్నిసార్లు లాటరీ పేరుతో అమాయకుల కష్టార్జిత సొమ్ము మాయమైపోతోంది. అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంకు అయిన హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ తన కస్టమర్లను మోసం చేసే కొత్త పద్ధతి గురించి హెచ్చరించింది.

కేవైసీ పేరుతో మోసం..

ఈ రోజుల్లో హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కస్టమర్లను లక్ష్యంగా చేసుకుని దుండగుల ముఠా ఉంది. మీరు కూడా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కస్టమర్ అయితే జాగ్రత్తగా ఉండండి. ఈ కొత్త పద్ధతిలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఖాతాదారులను కేవైసీ పేరుతో బెదిరించి మోసం చేస్తున్నారు. అటువంటి కస్టమర్లకు తమ కేవైసీ గడువు ముగిసిందని దుండగులు ముందుగా చెబుతూ ఫోన్‌లు చేస్తున్నారు. మళ్లీ కేవైసీ చేయిస్తామనే పేరుతో దుండగులు ప్రజల బ్యాంకు ఖాతాలను ఖాళీ చేస్తున్నారు.

హెచ్‌డీఎఫ్‌సి బ్యాంక్‌కు చెందిన చాలా మంది కస్టమర్‌లకు కేవైసీ పేరుతో సందేశాలు వస్తున్నాయి. వేర్వేరు నంబర్‌ల నుంచి వస్తున్న సందేశాలలో కస్టమర్‌లు వారి కేవైసీ పూర్తి చేయలేదని, లేదా కేవైసీ గడువు ముగిసిందని చెబుతూ ఫోన్‌లు, సందేశాలు పంపుతున్నారు. మీ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఖాతా కోసం కేవైసీ పెండింగ్‌లో ఉంది. ఈ లింక్‌పై క్లిక్ చేయడం ద్వారా దాన్ని పూర్తి చేసుకోవచ్చంటూ మెసేజ్‌లు పంపిస్తున్నారు. ఇలా వారు పంపిన లింక్‌లను క్లిక్‌ చేసినట్లయితే మీ ఖాతా ఖాళీ అయిపోయినట్లే.

ఇవి కూడా చదవండి

బ్యాంకు అప్రమత్తమైంది

ఈ మేరకు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ తన ఖాతాదారులను అప్రమత్తం చేసింది. KYC లేదా PAN అప్‌డేట్ చేయడానికి సంబంధించి అందుతున్న అనుమానాస్పద సందేశాలపై దృష్టి పెట్టవద్దని, దానితో పాటు పంపుతున్న లింక్‌లపై క్లిక్ చేయవద్దని బ్యాంకు సూచించింది. ఇలాంటి దుండగుల నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోండి. అధికారిక ID HDFCBK/HDFCBN నుంచి బ్యాంకు ద్వారా సందేశాలు వస్తాయని, లింక్ hdfcbk.io నుండి ప్రారంభమవుతుందని ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి.

ఇతర ID నుంచి వస్తున్న సందేశాలను పట్టించుకోవద్దని బ్యాంకు ఖాతాదారులను కోరింది. దీనితో పాటు తప్పుగా కనిపించే లింక్‌లపై క్లిక్ చేయవద్దు. మీరు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే, మీరు కష్టపడి సంపాదించిన డబ్బు కోల్పోతారు.

ఇంతకుముందు విద్యుత్ కనెక్షన్ పేరుతో చాలా మంది మోసపోయారని బ్యాంకు తెలిపింది. కరెంటు బిల్లు జమ కాలేదని, త్వరగా జమ చేయకుంటే కనెక్షన్‌ నిలిపివేస్తామని చెబుతూ మోసగాళ్లు మోసగిస్తున్నారు. ఇందు కోసం లింక్‌లను పంపి దుండగులు మోసం చేస్తున్నారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి