Telugu News Business Have hdfc or icici credit cards these rules are changing from july 1 details in telugu
Credit Cards: క్రెడిట్‌కార్డు హోల్డర్స్‌కు ఆ రెండు బ్యాంకుల షాక్.. కీలక నియమాల మార్పు
బ్యాంకింగ్ రంగంలో పెరిగిన టెక్నాలజీ నేపథ్యంలో లావాదేవీల విషయంలో కీలక మార్పులు వచ్చాయి. ముఖ్యంగా వివిధ కార్డుల ద్వారా చేసే లావాదేవీల సంఖ్య పెరిగింది. ఉద్యోగస్తుల ఎక్కువగా క్రెడిట్ కార్డులను వాడడం పరిపాటిగా ఉంది. అయితే ఇటీవల ఓ రెండు బ్యాంకులు క్రెడిట్ కార్డు హోల్డర్స్‌కు షాక్ ఇచ్చాయి. వచ్చే నెల నుంచి కీల నియమాలు మారతాయని ప్రకటించాయి.
భారతదేశంలో ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంకులుగా ఉన్న హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంకులు తమ క్రెడిట్ కార్డు వినియోగదారులకు కీలక విషయాలను తెలిపాయి. ఈ బ్యాంకుల క్రెడిట్ కార్డ్ కలిగి ఉంటే జూలై 1, 2025 నుంచి నియమాలు మారతాయని వివరించాయి. ఆయా మార్పుల గురించి మరిన్ని వివరాలను చూద్దాం.
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డు నిబంధనలు
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఆన్‌లైన్ గేమింగ్, వాలెట్ లోడ్‌లు, బీమా లావాదేవీలపై రివార్డ్ పాయింట్లకు సంబంధించిన ఛార్జీలను సవరిస్తోంది. ఈ అప్‌డేట్స్ మీరు మీ క్రెడిట్ కార్డ్‌ను ఉపయోగించే విధానాన్ని ప్రభావితం చేయవచ్చు.
మీరు ఆన్‌లైన్ గేమింగ్ ప్లాట్‌ఫామ్‌లపై నెలకు రూ.10,000 కంటే ఎక్కువ ఖర్చు చేస్తే ఆ మొత్తంపై 1 శాతం రుసుము వసూలు చేస్తారు. అయితే మీరు ఎంత ఖర్చు చేసినా ఈ రుసుము నెలకు రూ.4,999కి పరిమితం చేశారు.
అలాగే క్రెడిట్ కార్డును వినియోగించి థర్డ్-పార్టీ వాలెట్‌కి (పేటీఎం, మొబిక్విక్, ఫ్రీచార్జి, లేదా ఓలా మనీ వంటివి) ఒక నెలలో రూ. 10,000 కంటే ఎక్కువ యాడ్ చేస్తే ఆ మొత్తం లావాదేవీ మొత్తానికి 1 శాతం రుసుము కూడా వసూలు చేస్తారు.
మీ యుటిలిటీ బిల్లు చెల్లింపులు నెలకు రూ. 50,000 దాటితే మొత్తం ఖర్చుపై 1 శాతం ఛార్జ్ చేస్తాయి. అయితే బీమా చెల్లింపులు ఎటువంటి అదనపు రుసుమును వసూలు చేయవు.
అలాగే అద్దె చెల్లింపులపై 1 శాతం రుసుము మునుపటిలాగే కొనసాగుతుంది.
రూ. 15,000 కంటే ఎక్కువ ఇంధన ఖర్చులకు, 1 శాతం రుసుము వర్తిస్తుంది, కానీ గరిష్ట రుసుము రూ. 4,999కి పరిమితం చేస్తారు.
ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు నిబంధనలు
ఐసీఐసీఐ బ్యాంక్ తన సేవా ఛార్జీలు, వినియోగ నిబంధనలను కూడా నవీకరించింది. నగదు డిపాజిట్లు, చెక్కులు, డిమాండ్ డ్రాఫ్ట్‌లు, పే ఆర్డర్ లావాదేవీల కోసం కస్టమర్లు ఇప్పుడు డిపాజిట్ చేసిన ప్రతి రూ.1,000కి రూ.2 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. కనీస ఛార్జీ రూ.50, గరిష్టంగా రూ.15,000 ఉంటుంది. గతంలో రూ.10,000 వరకు డిపాజిట్‌లకు రూ.50, పెద్ద మొత్తాలకు రూ.1,000కి రూ.5 చొప్పున వసూలు చేసేవారు.
ఏటీఎం ఛార్జీలు కూడా పెరిగాయి. ఇతర బ్యాంకుల ఏటీఎంలలో మూడు ఉచిత లావాదేవీల తర్వాత ఐసీఐసీ ఆర్థిక లావాదేవీలకు రూ.23 మరియు ఆర్థికేతర లావాదేవీలకు రూ.8.50 వసూలు చేస్తుంది.
అప్‌డేటెడ్ విధానం ప్రకారం గత త్రైమాసికంలో కనీసం రూ. 75,000 ఖర్చు చేసిన ఐసీఐసీఐ క్రెడిట్ కార్డ్ హోల్డర్లు మాత్రమే తదుపరి మూడు నెలల పాటు ఉచిత దేశీయ విమానాశ్రయ లాంజ్ యాక్సెస్‌కు అర్హత ఉంటుంది.