Hanging Train: మీరు ఎప్పుడైనా పట్టాల కింద వేలాడుతూ నడిచే రైళ్లను చూశారా..? ఇదిగో మీ కోసం..!

|

Nov 16, 2021 | 7:13 PM

Hanging Train: ట్రాక్‌లపై, నేలపై, వంతెనలపై, భూగర్భంలో రైళ్లు పరుగులు పెట్టడం చూసే ఉంటారు. మామూలు రైళ్లు అయినా, మోనో రైళ్లు అయినా పట్టాలపై ప్రయాణిస్తుంటాయి. ..

Hanging Train: మీరు ఎప్పుడైనా పట్టాల కింద వేలాడుతూ నడిచే రైళ్లను చూశారా..? ఇదిగో మీ కోసం..!
Follow us on

Hanging Train: ట్రాక్‌లపై, నేలపై, వంతెనలపై, భూగర్భంలో రైళ్లు పరుగులు పెట్టడం చూసే ఉంటారు. మామూలు రైళ్లు అయినా, మోనో రైళ్లు అయినా పట్టాలపై ప్రయాణిస్తుంటాయి. అయితే పట్టాల కింద రైళ్లు వేలాడుతూ ప్రయాణించడం ఎప్పుడైనా చూశారా..? ఆశ్చర్యం కలిగించే రైళ్లు చూడండి.

హ్యాంగింగ్‌ ట్రైన్‌: ఈ ట్రైన్‌ ఇండియాలో కాదు జర్మనీలో ఉంది. ఈ రైళ్లు పట్టాలపై నడవవు. జర్మనీలోని వుప్పర్టల్‌ సస్పెన్షన్‌ కింద నడుస్తాయి. ఈ రైళ్లు రోప్‌వేల వలె నడుస్తాయి.ఈ రైలు ప్రయాణం ఎంతో ఉల్లాసంగా ఉంటుంది. ఈ రైలు రోజు 13.3 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. దీని మార్గంలో 20 స్టేషన్లు ఉన్నాయి.

ఉరి రైలు: రైలు పట్టాలపై నడుస్తున్నప్పటికీ సాధారణ రైళ్లలో ప్రజలు కూర్చునే విధానంలాగే ఉంటుంది. ఎంతో హాయిగా ప్రయాణించవచ్చు. ఈ ఎలక్ట్రిక్‌ రైలు భూమి నుంచి 39 మీటర్ల ఎత్తులో నడుస్తుంది.

రివర్స్‌ రైలు: మొదటిసారిగా ఈ రివర్స్‌ రైలు గురించి తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఈ రైలు దాదాపు 120 సంవత్సరాల కిందట అంటే 1901 ప్రారంభమైంది. ఇది ప్రపంచంలోని పురాతన మోనోరైళ్లలో ఒకటిగా చెబుతారు. జర్మనీకి వెళ్లే పర్యాటకులు ఈ రైలులో ఒక్కసారైనా ప్రయాణించి తీరాలి.

సస్పెన్షన్ మోనోరైల్ జర్మనీలోని వుప్పర్టాల్‌లో ప్రారంభించబడింది. ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన హ్యాంగింగ్ కార్ ఎలక్ట్రిక్ ఎలివేటెడ్ రైలు. కింద నడిచే రైలు ప్రయాణం.. మిగిలిన రైళ్ల ప్రయాణం కంటే కాస్త భిన్నంగా ఉంటుంది. దీనిని 1901లో ఇది దాదాపు 19,200 టన్నుల ఉక్కును ఉపయోగించి తయారు చేశారు. ప్రతిరోజూ సుమారు 85 వేల మంది ప్రయాణం కొనసాగిస్తుంటారు.

ఇవి కూడా చదవండి:

Indian Railways: రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. ఆ స్టేషన్‌లో దేశంలోనే తొలి పాడ్‌ హోటల్‌.. రేపు ప్రారంభం!

SBI Loan: కస్టమర్లకు ఎస్‌బీఐ గుడ్‌న్యూస్‌.. నాలుగు క్లిక్స్‌తో వ్యక్తిగత రుణాలు.. వెంటనే అకౌంట్లోకి డబ్బులు..!