Grofers: పాలు సరఫరా చేసినట్లే 10 నిమిషాల్లో ఐఫోన్‌ కూడా అందిస్తాం!

సాధారణంగా ఆన్‌లైన్‌లో ఫోన్‌ ఆర్డర్‌ చేస్తే మన చిరునామాకు చేరడానికి కనీసం ఒకటి లేదా రెండు రోజులు పడుతుంది.

Grofers: పాలు సరఫరా చేసినట్లే 10 నిమిషాల్లో ఐఫోన్‌ కూడా అందిస్తాం!
Grofers E Commerce

Updated on: Oct 19, 2021 | 5:28 PM

సాధారణంగా ఆన్‌లైన్‌లో ఫోన్‌ ఆర్డర్‌ చేస్తే మన చిరునామాకు చేరడానికి కనీసం ఒకటి లేదా రెండు రోజులు పడుతుంది. అయితే ఆర్డరిచ్చిన 10 నిమిషాల్లోనే ఫోన్లను ఇంటికి తెచ్చిస్తామంటోంది ‘గ్రో ఫోర్స్‌’. ఆన్‌లైన్‌లో ఆర్డర్లు తీసుకుని, నిత్యావసర వస్తువులను సరఫరా చేసే ఈ సంస్థ ఈ-కామర్స్‌ కంపెనీగా తమ సేవలను మరింత విస్తరించేందుకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా పాల లాంటి నిత్యావసర వస్తువుల నుంచి ఐఫోన్‌ లాంటి ఖరీదైన స్మార్ట్‌ఫోన్ల దాకా అన్నింటినీ ఆర్డరిచ్చిన 10 నిమిషాల్లోనే సరఫరా చేస్తామంటోంది. ఇందుకోసం స్థానికంగా ఉంటే రిటైల్‌ వ్యాపారులతో జట్టు కట్టేందుకు సిద్ధమవుతోంది. 2013లో ఏర్పాటైన గ్రోఫోర్స్‌… ఈ ఏడాది ఆగస్టులో ఆన్‌లైన్‌లో ఆర్డరిచ్చిన 10 నిమిషాల్లోనే సరకులను సరఫరా చేసే సేవలను ప్రారంభించింది. ఇప్పటికే దిల్లీ, ముంబయి, బెంగళూరు, జయపుర లాంటి 10 నగరాల్లో ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి.

ఆర్డరిచ్చిన పది నిమిషాల్లోనే ఐ ఫోన్లు!
ఈ నేపథ్యంలో ‘ఈ-కామర్స్’ సంస్థగా తమ సేవలను విస్తరించాలనుకుంటోన్న గ్రోఫోర్స్‌…స్మార్ట్‌ఫోన్లను కూడా ఆర్డరిచ్చిన పది నిమిషాల్లోపే ఇంటికి చేరవేయాలని భావిస్తోంది. ‘ఉదయం టీ తయారుచేసుకోవడం పాలు, నైట్‌ పార్టీలకు అందంగా ముస్తాబు కావడానికి పర్ఫెక్ట్‌ లిప్‌స్టిక్‌ సరఫరా చేసినట్లుగానే ఐ ఫోన్‌ కూడా ఆర్డరిచ్చిన 10 నిమిషాల్లోపే అందించాలని గ్రోఫోర్స్‌ సంస్థ భావిస్తోంది. ‘ఇన్‌స్టంట్‌ కామర్స్‌’ (తక్షణ సరఫరా సేవల) విభాగంలో మా వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవాలని భావిస్తున్నాం. ఇందుకోసం ఇప్పటికే 13 నగరాల్లో 86 డార్క్‌ స్టోర్స్‌ యజమానులతో జత కట్టాం. మరికొందరు వ్యాపారవేత్తల కోసం మేం అన్వేషణ కొనసాగిస్తున్నాం’ అని గ్రోఫోర్స్‌ సీఈవో అల్బిందర్‌ థిండ్సా ట్వీట్‌ చేశారు.

Read Also: Jr.NTR-Lakshmi Pranathi: సోషల్ మీడియాకు దూరంగా ఎన్టీఆర్ సతిమణీ.. పెళ్లి కాకముందు లక్ష్మీ ప్రణతి ఎలా ఉందో చూశారా..?

Tomato Price: మండుతున్న టమోట ధరలు.. సామాన్యుడు విలవిల.. కిలో ధర ఎంతంటే..?

Custard Apple Farming: సీతాఫలం సాగుతో అధిక లాభాలు.. తక్కువ పెట్టుబడి ఎక్కువ లాభం..

Dry Cough: పొడి దగ్గుని తక్కువ అంచనా వేయకండి..! తక్షణ ఉపశమనం కోసం ఇలా చేయండి..