Gold Imports: బంగారం దిగుమతి నిబంధనలు కఠినతరం.. కేంద్రం కీలక నిర్ణయం..!

Advance Authorisation Scheme: మే 13 నుండి అమలులోకి వచ్చిన కొత్త నిబంధనల ప్రకారం, బంగారం, వెండిపై దిగుమతి సుంకం 6% నుండి 15%కి పెరిగింది. GSTతో కలిపి ఇది దాదాపు 18.45 శాతానికి చేరుకుంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో బంగారం దిగుమతులు..

Gold Imports: బంగారం దిగుమతి నిబంధనలు కఠినతరం.. కేంద్రం కీలక నిర్ణయం..!
Advance Authorisation Scheme

Updated on: May 15, 2026 | 8:38 AM

Advance Authorisation Scheme: బంగారం దిగుమతి నిబంధనలను కఠినతరం చేసిన ప్రభుత్వం. విలువైన లోహాలపై దిగుమతి సుంకాన్ని భారీగా పెంచిన మరుసటి రోజే, కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ‘అడ్వాన్స్ ఆథరైజేషన్’ (Advance Authorisation) పథకం కింద బంగారం దిగుమతులపై 100 కిలోల గరిష్ట పరిమితిని విధిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.

ఇది కూడా చదవండి: Gold Price Today: బాబోయ్‌ మళ్లీ బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఇక కొనడం కష్టమే..!

ఏమిటీ అడ్వాన్స్ ఆథరైజేషన్ స్కీమ్?

ఈ పథకం కింద ఆభరణాల ఎగుమతిదారులు తమ తయారీకి అవసరమైన ముడి పదార్థాలను (బంగారం వంటివి) సుంకం లేకుండా (Zero Duty) దిగుమతి చేసుకోవచ్చు. గతంలో ఈ పథకం కింద బంగారం దిగుమతిపై ఎటువంటి పరిమితి ఉండేది కాదు. కానీ ఇప్పుడు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (DGFT) దీనిపై 100 కిలోల సీలింగ్ విధించింది.

ఇవి కూడా చదవండి

కొత్త నిబంధనలు ఇవే:

ఒక వ్యక్తి లేదా సంస్థ ఈ పథకం కింద గరిష్టంగా 100 కిలోల బంగారాన్ని మాత్రమే దిగుమతి చేసుకోవాలి. మొదటిసారి దరఖాస్తు చేసుకునే వారి ఉత్పాదక యూనిట్లను అధికారులు స్వయంగా పరిశీలిస్తారు. అక్కడ తయారీ సామర్థ్యం, పనితీరును ధృవీకరించిన తర్వాతే అనుమతులు ఇస్తారు. అలాగే ఒకసారి దిగుమతి చేసుకున్న తర్వాత కనీసం 50 శాతం ఎగుమతి లక్ష్యాన్ని పూర్తి చేస్తేనే తదుపరి దిగుమతికి అనుమతి లభిస్తుంది. దిగుమతిదారులు ప్రతి 15 రోజులకు ఒకసారి తమ దిగుమతి-ఎగుమతి వివరాలను స్వతంత్ర చార్టర్డ్ అకౌంటెంట్ ద్వారా ధృవీకరించి నివేదిక సమర్పించాలి.

ఎందుకు ఈ నిర్ణయం?

పశ్చిమ ఆసియాలో నెలకొన్న ఉద్రిక్తతల వల్ల అంతర్జాతీయంగా బంగారం ధరలు పెరుగుతున్నాయి. దేశీయంగా దిగుమతి సుంకం 15 శాతానికి పెరగడంతో కొందరు ఈ ‘జీరో డ్యూటీ’ పథకాన్ని దుర్వినియోగం చేసి భారీగా బంగారాన్ని నిల్వ చేసే అవకాశం ఉందని ప్రభుత్వం భావించింది. అందుకే ఈ ముందస్తు ఆంక్షలు విధించింది.

పెరిగిన దిగుమతి భారం:

మే 13 నుండి అమలులోకి వచ్చిన కొత్త నిబంధనల ప్రకారం, బంగారం, వెండిపై దిగుమతి సుంకం 6% నుండి 15%కి పెరిగింది. GSTతో కలిపి ఇది దాదాపు 18.45 శాతానికి చేరుకుంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో బంగారం దిగుమతులు రికార్డు స్థాయిలో 71.98 బిలియన్ డాలర్లకు చేరడం, రూపాయి విలువ డాలర్‌తో పోలిస్తే 95.75 వద్ద ఆల్‌టైమ్ లోకి పడిపోవడం ఈ కఠిన నిర్ణయాలకు దారితీసింది.

ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల అనవసరపు విదేశీ మారక ద్రవ్య వ్యయం తగ్గి, రూపాయి విలువ స్థిరపడే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఎగుమతిదారులకు మాత్రం ఈ 100 కిలోల పరిమితి కొంత సవాలుగా మారే అవకాశం ఉంది.

ఇది కూడా చదవండి: Big Breaking: వాహనదారులకు షాకింగ్‌ న్యూస్‌.. భారత్‌లో పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు.. లీటర్‌కు ఎంతంటే..

ఇది కూడా చదవండి: Handwritten Will: తెల్ల కాగితంపై రాసిన వీలునామా చెల్లుతుందా? సాక్షులు లేకపోతే ఆస్తి పక్కవారి పాలేనా?

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us