Ration Card: వీరు ఇక రేషన్‌ సరుకులు పొందలేరు..10 లక్షల రేషన్‌ కార్డులు రద్దు.. ఎందుకో తెలుసా..?

|

Nov 10, 2022 | 8:44 AM

దేశవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలు ఉచిత ప్రభుత్వ రేషన్‌ను సద్వినియోగం చేసుకుంటున్నారు. రేషన్‌ కార్డుల విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం..

Ration Card: వీరు ఇక రేషన్‌ సరుకులు పొందలేరు..10 లక్షల రేషన్‌ కార్డులు రద్దు.. ఎందుకో తెలుసా..?
Ration Card
Follow us on

దేశవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలు ఉచిత ప్రభుత్వ రేషన్‌ను సద్వినియోగం చేసుకుంటున్నారు. రేషన్‌ కార్డుల విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంటోంది. ఈ మధ్య కాలంలో నకిలీ రేషన్‌ కార్డులు పెరిగిపోతున్నాయి. అలాంటి కార్డులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోంది. నకిలీ రేషన్‌ కార్డులు కలిగిన వారి రేషన్ను నిలిపివేసే పనిలో ఉంది ప్రభుత్వం. దేశ వ్యాప్తంగా 10 లక్షల నకిలీ రేషన్ కార్డులను ప్రభుత్వం ఇటీవల గుర్తించింది . ఈ రేషన్ కార్డులు త్వరలో రద్దు చేయబడతాయి. వారి రేషన్ పూర్తిగా నిషేధించబడతాయి. రేషన్ కార్డులు నకిలీవని తేలిన వారి ప్రభుత్వం రేషన్‌ను కూడా రికవరీ చేయనుంది.

దేశవ్యాప్తంగా 80 కోట్ల మందికి పైగా ప్రజలు ఉచిత రేషన్ కార్డును పొందుతున్నారు. అయితే ఈ సదుపాయాన్ని తీసుకునే అర్హత లేనివారు దేశంలో కోట్లాది మంది ఉన్నారు. ఇంత జరుగుతున్నా ఉచిత రేషన్ సౌకర్యాన్ని ఏళ్ల తరబడి సద్వినియోగం చేసుకుంటున్నారు. ఇటీవల ప్రభుత్వం 10 లక్షల మంది అనర్హుల రేషన్ కార్డుదారులను గుర్తించింది. ఇకపై ఉచిత గోధుమలు, శనగలు, బియ్యం ప్రయోజనం పొందలేరు. నకిలీ రేషన్ కార్డులు కలిగివున్నవారిపై ప్రభుత్వం చర్యలు చేపట్టనుంది.

అనర్హుల జాబితాను రేషన్ డీలర్లకు పంపాలని ఆదేశాలు ఇచ్చామని అధికారులు వివరించారు. రేషన్ డీలర్లు పేర్లను గుర్తించి, అలాంటి కార్డుదారుల నివేదికను జిల్లా కేంద్రానికి పంపుతారు. ఆ తర్వాత వారి కార్డులు రద్దు చేయబడతాయి.

ఇవి కూడా చదవండి

నేషనల్‌ ఫుడ్‌ సెక్యూరిటీ యాక్ట్‌ (ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ) వివరాల ప్రకారం.. ఆదాయపు పన్ను చెల్లించే కార్డ్ హోల్డర్లు, 10 బిగాల కంటే ఎక్కువ భూమి ఉన్నవారి జాబితాను సిద్ధం చేస్తున్నారు. అలాంటి వారు రేషన్ కార్డు కలిగివుంటే రద్దు చేయనున్నారు. గత 4 నెలలుగా ఉచిత రేషన్ తీసుకోని వారు, అదే సమయంలో, ఉచిత రేషన్‌తో వ్యాపారం చేసేవారు కూడా ఉన్నారు. అలాంటి వారిని కూడా గుర్తించారు. యూపీలో అత్యధికంగా నకిలీ రేషన్‌ కార్డులు ఉన్నట్లు కేంద్రం గుర్తించింది. అయితే రేషన్‌కార్డుదారుల అర్హతలను పరిశీలించే పని ఇంకా కొనసాగుతోంది.

మరిన్ని బిజిెనెస్ న్యూస్ కోసం