
Government Scheme: కేంద్ర ప్రభుత్వం యువతకు, వ్యాపారం ప్రారంభించడానికి ఆసక్తి ఉన్నవారికి సహాయం చేస్తోంది. వ్యాపారాన్ని ప్రారంభించడానికి లేదా విస్తరించడానికి రూ.20 లక్షల వరకు రుణాలను అందిస్తోంది. ఎటువంటి హామీ అవసరం లేదు. ఇది పూచీకత్తు లేని రుణం. ఈ భారత ప్రభుత్వ పథకం గతంలో రూ.10 లక్షల వరకు మాత్రమే రుణాలను అందించింది. కానీ ఇప్పుడు రుణ పరిమితిని రూ.20 లక్షలకు విస్తరించారు. FY2024-25 బడ్జెట్ ప్రసంగం సందర్భంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రుణ పరిమితిని రూ.20 లక్షలకు రెట్టింపు చేశారు.
ఈ సాయం అందించే పథకం పేరు పథకం ప్రధాన్ మంత్రి ముద్ర యోజన (PMMY). ఇది నాలుగు కేటగిరిలలోని వ్యాపారాలకు రుణాలు అందిస్తుంది. తద్వారా వారు కాలక్రమేణా తమ వ్యాపారాలను విస్తరించుకోవచ్చు. శిశు కేటగిరీ కింద రూ.50,000 రుణం, కిషోర్ కేటగిరీ కింద రూ.50,000 నుంచి రూ.5 లక్షల వరకు, తరుణ్ కేటగిరీ కింద రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు, తరుణ్ ప్లస్ కింద రూ.10 నుంచి 20 లక్షల వరకు రుణం ఇస్తారు.
ఇది కూడా చదవండి: School Holidays: తెలంగాణలో 4 రోజుల పాటు పాఠశాలలకు సెలవులు? కారణం ఏంటో తెలుసా?
ప్రధానమంత్రి ముద్ర యోజనను మోడీ ప్రభుత్వం 2015లో ప్రారంభించింది. ఇది ప్రత్యేకంగా సొంతంగా వ్యాపారం ప్రారంభించాలనుకునే వారి కోసం రూపొందించారు. 8వ తరగతి ఉత్తీర్ణులైనా ఏ భారతీయ పౌరుడైనా ఈ పథకం కింద దరఖాస్తు చేసుకోవచ్చు. ఎటువంటి విద్యా అర్హతలు అవసరం లేదు. ఈ పథకం కింద ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, నివాస ధృవీకరణ పత్రం, పాస్‌పోర్ట్ సైజు ఫోటో, వ్యాపార ప్రణాళిక, కేవైసీ పత్రం, ఆదాయ రుజువు కలిగి ఉండటం అవసరం. అయితే నియమ నిబంధనలు పాటించాల్సి ఉంటుందని గుర్తించుకోండి. ఎందుకంటే ఈరోజుల్లో రుణం పొందాలంటే ఎంతో ప్రాసెస్ ఉంటుంది. అలాంటి ఎలాంటి పూచికత్తు లేకుండా రుణం పొందాలంటే అన్ని అర్హతలు ఉండాల్సిందే.
ఇది కూడా చదవండి: Insulin Plant: ఇంట్లో ఇన్సులిన్ మొక్కను ఎలా పెంచాలి? ఇది డయాబెటిస్ వారికి వరం!
ఇది కూడా చదవండి: Investments Plan: కేవలం రూ.1000తో పెట్టుబడి ప్రారంభిస్తే చేతికి రూ.11.57 కోట్లు.. కాసులు కురిపించే స్కీమ్!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి