Gold Investment: పసిడిపై పసందైన రాబడి.. గోల్డ్ ఈటీఎఫ్‌లకు పెరుగుతున్న డిమాండ్

|

Mar 18, 2025 | 3:15 PM

ప్రపంచవ్యాప్తంగా ఇటీవల కాలంలో బంగారం అనేది ఒక నమ్మకమైన పెట్టుబడి ఎంపికగా మారింది. అయితే ప్రపంచవ్యాప్తంగా పెరిగిన రాజకీయ అనిశ్చితి నేపథ్యంలో బంగారం ధరలు విపరీతంగా పెరిగింది. భారతదేశంలో ఏళ్లుగా బంగారాన్ని ఆభరణాలుగా మాత్రమే కొనుగోలు చేస్తూ ఉంటారు. అయితే పెరిగిన ఆర్థిక అక్షరాస్యత నేపథ్యంలో ఇటీవల కాలంలో యువత గోల్డ్ ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్ (ఈటీఎఫ్)లలో కూడా పెట్టుబడి పెడుతున్నారు.

Gold Investment: పసిడిపై పసందైన రాబడి.. గోల్డ్ ఈటీఎఫ్‌లకు పెరుగుతున్న డిమాండ్
Gold Etfs
Follow us on

సెంట్రల్ బ్యాంకులు, గోల్డ్ ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్ (ఈటీఎఫ్) పెట్టుబడిదారులు 2025 లో బంగారం డిమాండ్‌కు కీలక చోదకులుగా మారతారని పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలతో పాటు ఆర్థిక అనిశ్చితులు బంగారం ధరలను పెంచుతాయని భావిస్తున్నారు. అయితే కేంద్ర బ్యాంకుల చర్యలు బంగారం ధరలను ప్రభావితం చేసే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. మోతీలాల్ ఓస్వాల్ ప్రైవేట్ వెల్త్ నివేదిక ప్రకారం 2024లో భారతదేశంలో అత్యుత్తమ పనితీరు కనబరిచే పెట్టుబడి ఎంపికల్లో బంగారం తన స్థానాన్ని సుస్థితరం చేసుకుంటుంది. 2024లో బంగారం ఏకంగా పెట్టుబడిదారులకు 21 శాతం రాబడిని అందించింది. భారత మార్కెట్ బంగారంపై బలమైన పెట్టుబడి ఆసక్తిని కనబరిచింది. ముఖ్యంగా గోల్డ్ ఈటీఎఫ్‌లలో రికార్డు స్థాయిలో పెట్టుబడులు రావడం వల్ల ఈ స్థాయి వృద్ధి నమోదైంది 2024లో భారతీయ గోల్డ్ ఈటీఎఫ్‌లు 112 బిలియన్ల నికర పెట్టుబడులను నమోదు చేశాయి. 

2024 సంవత్సరం చివరి నాటికి 57.8 టన్నులకు చేరుకుంది. ఈ వృద్ధి సంస్థాగత, రిటైల్ పెట్టుబడిదారుల నుంచి బలమైన డిమాండ్‌ను సూచిస్తుందని నివేదికలు పేర్కొంటున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా బంగారం నిల్వల ధోరణిని కొనసాగించింది. 2024లో దాని నిల్వలకు 72.6 టన్నుల బంగారాన్ని జోడించింది. దీనితో దాని మొత్తం నిల్వలు 876 టన్నులకు చేరుకున్నాయి. ఏడో ఏడాది ఆర్‌బీఐ నికర బంగారం కొనుగోలుదారుగా నిలిచింది. బంగారం ఇప్పుడు ఆర్‌బీఐ విదేశీ మారక నిల్వలలో 10.6 శాతంగా ఉంది. అధిక ధరలు ఆభరణాల డిమాండ్‌ను ప్రభావితం చేసినప్పటికీ భౌతిక బంగారం, ముఖ్యంగా కడ్డీలు, నాణేలకు పెట్టుబడి డిమాండ్ బలంగా ఉంది. 

అధిక ధరల కారణంగా 2024లో డిమాండ్ తగ్గినప్పటికీ వివాహాల సీజన్ కొనుగోళ్ల కారణంగా జనవరి మధ్యలో క్రమంగా కోలుకుంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే ఈ కోలుకోవడంలో ధరల స్థిరత్వం కీలక అంశంగా ఉంటుంది. వెండి విషయానికి వస్తే గత నాలుగు సంవత్సరాలుగా సరఫరాలో నిరంతర లోటు ఉందని, డిమాండ్ సరఫరాను మించిపోయిందని, దీనివల్ల వెండి ధరలు కూడా పెరుగుతున్నాయని పేర్కొంటున్నారు. 2020 నుంచి వెండికి పారిశ్రామిక డిమాండ్ క్రమంగా పెరుగుతోంది. ఇది ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి చేరుకుంది. ముఖ్యంగా చైనాలో తయారీ, పారిశ్రామిక కార్యకలాపాలు మరియు గ్రీన్ టెక్నాలజీలలో సంభావ్య వృద్ధి కారణంగా ఈ స్థాయి వృద్ది నమోదవుతుంది. అయితే వెండి బంగారం కంటే ఎక్కువ అస్థిరంగా ఉంటుంది. భారతీయ ఈక్విటీల మాదిరిగానే ధరల హెచ్చుతగ్గులను చూపుతుంది. అందువల్ల పోర్ట్‌ఫోలియోలలో బంగారం దీర్ఘకాలిక వ్యూహాత్మక ఆస్తిగా ఉపయోగపడుతుంది. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి