Electric Vespa: వెస్పా లవర్స్‌కు గుడ్‌ న్యూస్‌.. త్వరలోనే మార్కెట్‌లో వెస్పా ఈవీ వెర్షన్‌.. ఇక రోడ్లపై రయ్‌..రయ్‌..

|

Jul 13, 2023 | 7:00 PM

ముఖ్యంగా పట్టణ ప్రాంతంలోని స్కూటర్‌ మార్కెట్‌లో ఓ వెలుగు వెలుగుతున్న వెస్పా త్వరలోనే ఈవీ వెర్షన్‌లో అందుబాటులోకి వస్తుందని మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. వెస్పా ఈవీ వెర్షన్‌ గురించి పియాజియో కంపెనీ తెలిపిన వివరాలు ఓ సారి తెలుసుకుందాం.

Electric Vespa: వెస్పా లవర్స్‌కు గుడ్‌ న్యూస్‌.. త్వరలోనే మార్కెట్‌లో వెస్పా ఈవీ వెర్షన్‌.. ఇక రోడ్లపై రయ్‌..రయ్‌..
Vespa
Follow us on

ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్‌ వాహనాల ట్రెండ్‌ నడుస్తుంది. ముఖ్యంగా పెట్రోల్‌కు ప్రత్యామ్నాయంగా ఈవీ వాహనాలు మారడంతో ప్రభుత్వాలు కూడా ఈవీ వాహనాల వాడకాన్ని ప్రోత్సహిస్తున్నాయి. ప్రపంచంలో ఈవీ వాహనాల మార్కెట్‌లో అమెరికా, చైనా తర్వాత స్థానంలో భారతదేశం ఉందంటే దేశంలో ఈవీ వాహనాల వృద్ధిని అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఫోర్‌ వీలర్స్‌తో పోల్చుకుంటే ద్విచక్ర వాహనాల్లో ఈవీ వాహనాల వృద్ధి అధికంగా ఉంది. అయితే ద్విచక్ర వాహనాల్లో కూడా స్కూటర్లు ఎక్కువగా ప్రజలు ఆకర్షిస్తున్నాయి. దీంతో ప్రముఖ స్కూటర్‌ తయారీదారుల నుంచి స్టార్టప్‌ కంపెనీల వరకూ ఈవీ వాహనాలను రిలీజ్‌ చేస్తున్నాయి. అయితే పెట్రో వాహనాల్లో అధిక డిమాండ్‌ సొంతం చేసుకున్న కొన్ని కంపెనీలు మాత్రం ఈవీ వాహనాల రిలీజ్‌ చేయడంలో వెనుకంజలో ఉన్నాయి. ముఖ్యంగా పట్టణ ప్రాంతంలోని స్కూటర్‌ మార్కెట్‌లో ఓ వెలుగు వెలుగుతున్న వెస్పా త్వరలోనే ఈవీ వెర్షన్‌లో అందుబాటులోకి వస్తుందని మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. వెస్పా ఈవీ వెర్షన్‌ గురించి పియాజియో కంపెనీ తెలిపిన వివరాలు ఓ సారి తెలుసుకుందాం.

ఆటోమొబైల్ పరిశ్రమలో ప్రఖ్యాత బ్రాండ్ అయిన పియాజియో త్వరలో పియాజియో 1 ప్లస్‌ పేరుతో ఈవీ వాహనాల మార్కెట్‌లోకి ఎంట్రీ ఇస్తుంఆది. ఎలక్ట్రిక్ వాహనాలకు పెరుగుతున్న డిమాండ్‌తో, పియాజియో ఈ స్కూటర్‌ని ఆధునిక ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా రూపొందించింది. విశేషమైన శ్రేణి, అసాధారణమైన ఫీచర్ల శ్రేణిని అందిస్తుంది.  పియాజియో 1 ప్లస్‌ ఒక్కసారి ఛార్జింగ్‌తో 100 కిలో మీటర్ల మైలేజ్‌ అందిస్తుందని కంపెనీ ప్రతనిధులు చెబుతున్నారు. ముఖ్యంగా రిమూవబుల్‌  2.3కేడబ్ల్యూహెచ​ లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌తో అమర్చిన ఈ స్కూటర్ దీర్ఘకాలిక పనితీరును నిర్ధారిస్తుంది. ఇది ఒక బలమైన 1700 వాట్ బీఎల్‌డీసీ ఎలక్ట్రిక్ మోటారు ద్వారా శక్తిని పొందుతుంది

ఛార్జింగ్ సిస్టమ్, ఫీచర్లు

పియాజియో 1 ప్లస్‌ సాధారణ, ఫాస్ట్ ఛార్జింగ్ ఎంపికలను కలిగి ఉన్న బహుముఖ ఛార్జింగ్ సిస్టమ్‌తో వస్తుంది. అంటే ఈ స్కూటర్‌ను తక్కువ సమయంలో సౌకర్యవంతంగా ఛార్జ్ చేయవచ్చు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ రిమోట్ యాక్సెస్, ఎల్‌ఈడీ లైట్లు, స్టార్ట్ బటన్, డిజిటల్ స్పీడోమీటర్, డిజిటల్ ఓడోమీటర్, యూఎస్‌బీ పోర్ట్, మల్టిపుల్ రైడింగ్ మోడ్‌లు వంటి అద్భుతమైన ఫీచర్లను అందిస్తుంది. ఈ ఫీచర్లు మొత్తం రైడింగ్ అనుభవాన్ని మెరుగుపరుస్తాయి

ఇవి కూడా చదవండి

పియాజియో వన్‌ ప్లస్‌ ధర 

పియాజియో వన్‌ ప్ల ధర సుమారు రూ.1.5 లక్షలుగా ఉంటుందని మార్కెట్‌ నిపుణులు అంచనా వేస్తున్నాయి. అంతేకాకుండా వినియోగదారులను ఆకర్షించే విధంగా సులభమైన ఈఎంఐ ప్లాన్లపై అందుబాటులో ఉండనుంది. పియాజియో వన్‌ ప్లస్‌ రాకతో ఈవీ వాహనాల్లో మరో టాప్‌ కంపెనీ చేరినట్లయ్యింది. 

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..