Vande Bharat Sleeper: తెలుగు రాష్ట్రాల్లో తొలి వందే భారత్ స్లీపర్.. ఈ రూట్లోనే ప్రయాణం.. రైల్వేశాఖ గ్రీన్ సిగ్నల్

తెలుగు రాష్ట్రాల్లో తొలి వందే భారత్ స్లీపర్ రైలుకు మార్గం సుగమమైంది. ఈ మేరకు రైల్వేశాఖ ప్రవేశపెట్టేందుకు సిద్దమవుతోంది. ఇప్పటికే మార్గాన్ని కూడా ఖరారు చేసింది. దేశంలో తొలి స్లీపర్ రైలును హౌరా-గువహతి మధ్య ప్రారంభమైంది. త్వరలోనే మరిన్ని రైళ్లు రానున్నాయి.

Vande Bharat Sleeper: తెలుగు రాష్ట్రాల్లో తొలి వందే భారత్ స్లీపర్.. ఈ రూట్లోనే ప్రయాణం.. రైల్వేశాఖ గ్రీన్ సిగ్నల్
Vande Bharat Sleeper

Updated on: Jun 19, 2026 | 12:36 PM

తెలుగు రాష్ట్రాల రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్. ఏపీ, తెలంగాణ మీదుగా ఇప్పటికే పలు వందే భారత్ రైళ్లు నడుస్తున్న విషయం తెలిసిందే. హైదరాబాద్, విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం, చెన్నై, బెంగళూరు లాంటి ప్రధాన నగరాల మధ్య ఈ రైళ్లు కనెక్టివిటీని అందిస్తున్నాయి. వీటి రాకతో వేగవంతమైన ప్రయాణం అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం ఉన్న ఈ రైళ్లల్లో స్లీపర్ కోచ్‌లు లేవు. కేవలం కూర్చోని మాత్రమే ప్రయాణం చేసే సౌకర్యం ఉంది. దూరపు ప్రయాణాలు చేసేవారు ఎక్కువదూరం కూర్చోని ప్రయాణం చేయడం కష్టమైన పని. అందుకే రైల్వేశాఖ వందే భారత్ స్లీపర్ కోచ్‌లను అందుబాటులోకి తీసుకొస్తోంది. ఇప్పటికే హౌరా-గువహతి మధ్య తొలి స్లీప్ ట్రైన్ ప్రారంభమవ్వగా.. మరిన్ని స్లీపర్ రైళ్లను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది.

తెలుగు రాష్ట్రాల్లో తొలి వందే భారత్ స్లీపర్..

తెలుగు రాష్ట్రాల్లో తొలి వందే భారత్ స్లీపర్ రైలు ఎప్పుడు, ఏయే మార్గాల్లో అందుబాటులోకి వస్తుందనే దానిపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. అయితే ఇందుకు మార్గం సుగమం అయింది. సికింద్రాబాద్-ఢిల్లీ మధ్య వందే భారత్ స్లీపర్ ట్రైన్ ప్రవేశపెట్టనున్నారు. ఇందుకు దక్షిణ మధ్య రైల్వే సన్నాహాలు చేస్తోంది. దేశవ్యాప్తంగా ప్రధాన నగరాలను అనుసంధానం చేసేలా రాత్రిపూట ప్రయాణికుల కోసం స్లీపర్ రైళ్లను కేంద్రం అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా న్యూఢిల్లీ-సికింద్రాబాద్ మార్గం కూడా ప్రస్తావనకు వచ్చింది. రానున్న రోజుల్లో ఈ కారిడార్‌లో వందే భారత్ స్లీపర్ రానుంది. దీని వల్ల సౌకర్యవంతంగా ప్రయాణం చేయవచ్చు.

ఈ మార్గాల్లో కూడా..

ఇక ఈ రూటుతో పాటు న్యూఢిల్లీ-శ్రీనగర్, ముంబై-అహ్మదాబాద్ , న్యూఢిల్లీ-పుణె, న్యూఢిల్లీ-చెన్నై, న్యూఢిల్లీ-హౌరా, న్యూఢిల్లీ-అహ్మదాబాద్, న్యూఢిల్లీ-ముంబై, ముంబై-బెంగళూరు మధ్య వందే భారత్ స్లీపర్ రైళ్లను రానున్న సంవత్సరాల్లో అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇప్పటికే వందే భారత్ స్లీపర్ రైల్ సెట్లు తయారుచేస్తున్నారు. శరవేగంగా వీటి తయారీ జరుగుతోంది. వీటి తయారీ పూర్తయిన తర్వాత విడతల వారీగా వందే భారత్ స్లీపర్ రైళ్లను కేంద్రం పట్టాలెక్కించనుంది. రానున్న రోజుల్లో పూర్తి స్థాయిలో అన్ని ప్రధాన నగరాలను అనుసంధానించేలా స్లీపర్ రైళ్లు రానున్నాయి. దీని వల్ల రాత్రిపూట ప్రయాణం మరింత సులువు కానుంది. ఈ రైళ్లల్లో ఎలాంటి శబ్దాలు, కుదుపులు అనేవి ఉండవు. ఈ ఏడాది జనవరిలో హౌరా-గువహతి మధ్య తొలి వందే భారత్ స్లీపర్ రైలును ప్రధాని మోదీ ప్రారంభించారు. ప్రయాణికుల నుంచి దీనికి మంచి స్పందన లభిస్తోంది. ఆక్సుపెన్సీ రోజురోజుకి పెరుగుతోంది. ఈ రైళ్లకు డిమాండ్ పెరుగుతోంది.

Follow Us