Indiramma Housing: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు తీపికబురు.. ఒక ఇంటికి అదనంగా రూ.72,000 ఆర్థిక సాయం!

Indiramma Housing: ఈ డేటా ఎంట్రీ ప్రక్రియను వేగంగా పూర్తి చేసి, అర్హులైన లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో నేరుగా అదనపు ఆర్థిక సహాయం జమ అయ్యేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వ సాయంతో పాటు కేంద్రం నుంచి అందే ఈ అదనపు..

Indiramma Housing: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు తీపికబురు.. ఒక ఇంటికి అదనంగా రూ.72,000 ఆర్థిక సాయం!
Indiramma Housing

Updated on: Oct 14, 2026 | 6:40 PM

Indiramma Housing Scheme: తెలంగాణలో పేదల సొంతింటి కలను నిజం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న ప్రతిష్టాత్మక ‘ఇందిరమ్మ ఇళ్ల’ పథకానికి సంబంధించి మరో కీలక నిర్ణయం వెలువడింది. ఈ స్కీమ్‌ను కేంద్ర ప్రభుత్వానికి చెందిన ‘ప్రధాన మంత్రి ఆవాస్ యోజన’ (PMAY) రూరల్ పోర్టల్‌తో అనుసంధానం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీని ద్వారా లబ్ధిదారులకు అదనపు ఆర్థిక భరోసా లభించనుంది.

కేంద్ర నిధుల జోడింపు:

పీఎం ఆవాస్ యోజన గ్రామీణ పథకం కింద తెలంగాణకు మంజూరైన ఇళ్లకు సంబంధించి, కేంద్ర ప్రభుత్వం ఒక్కో ఇందుకు రూ.72,000 చొప్పున సాయం అందించనుంది. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న రూ.5 లక్షల ఆర్థిక సహాయానికి తోడు, ఈ కేంద్ర నిధులు కూడా తోడవడంతో లబ్ధిదారులకు మరింత వెసులుబాటు కలగనుంది. ఇవే కాకుండా స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా మరుగుదొడ్ల నిర్మాణ నిధులు, ఉపాధి హామీ పథకం కింద పనిదినాల వేతనాలు కూడా అదనంగా అందనున్నాయి.

డేటా అప్‌లోడ్ ప్రక్రియ వేగవంతం:

ఈ పథకం ప్రయోజనాలను అర్హులైన ప్రతి ఒక్కరికీ అందించేలా రెండు విడతలుగా లబ్ధిదారుల వివరాలను ఆన్‌లైన్ పోర్టల్‌లో నమోదు చేస్తున్నారు.

తొలి దశలో ఇప్పటికే గృహ నిర్మాణాలు పూర్తి చేసుకున్న, నిర్మాణంలో ఉన్న లబ్ధిదారుల వివరాలను పీఎం ఆవాస్ యోజన వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేస్తున్నారు. ఇక రెండో విడతలో గుడిసెలు, తాత్కాలిక ఇళ్లలో జీవిస్తున్న మరో 25 వేల మంది పేదలను గుర్తించి వారి వివరాలను నమోదు చేయనున్నారు.

ఇది కూడా చదవండి: Viral Video: రైలు కిటికీ నుంచి ప్యాసింజర్ ఫోన్ దొంగిలిద్దాం అనుకున్నాడు.. ఆ తర్వాత ఏమైందో చూడండి

ఈ డేటా ఎంట్రీ ప్రక్రియను వేగంగా పూర్తి చేసి, అర్హులైన లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో నేరుగా అదనపు ఆర్థిక సహాయం జమ అయ్యేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వ సాయంతో పాటు కేంద్రం నుంచి అందే ఈ అదనపు నిధుల వల్ల పేదలకు ఇళ్ల నిర్మాణం మరింత సులువు కానుంది.

ఇవి కూడా చదవండి:

Indian Railways: కేంద్రం సంచలన నిర్ణయం.. రైల్వే ఉద్యోగులకు పండుగ బోనస్‌..10 లక్షల మందికి బెనిఫిట్

WhatsApp: వాట్సాప్‌లో విప్లవాత్మక మార్పులు.. సూపర్‌ అప్‌డేట్‌.. మైండ్‌ బ్లోయింగ్‌ ఫీచర్స్‌..!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us