ఇందిరమ్మ ఇళ్లు
తెలంగాణ ప్రభుత్వం నిరుపేదల సొంతింటి కలను నిజం చేయడానికి ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని (Indiramma Indlu Scheme) ప్రవేశపెట్టింది. గూడులేని అర్హులైన పేద కుటుంబాలకు గృహ వసతి కల్పించడమే ఈ పథకం ఉద్దేశం. ఈ పథకం కింద సొంత స్థలం ఉండి ఇల్లు నిర్మించుకోవాలనుకునేవారికి రూ.5 లక్షల ఆర్థిక సహాయాన్ని నాలుగు విడతల్లో అందిస్తుంది. ఒకవేళ ఇల్లు కట్టుకోవడానికి సొంత స్థలం లేని పేదలకు ఇండ్ల స్థలంతో పాటు రూ.5 లక్షల సాయం లేదా ఫ్లాట్లను కేటాయిస్తుంది. ప్రతి ఇల్లు కనీసం 400 చదరపు అడుగుల వైశాల్యంతో.. ఆర్సీసీ పైకప్పు, వంటగది, మరుగుదొడ్డి సౌకర్యాలతో నిర్మిస్తున్నారు. ఈ పథకంలో మహిళల పేరు మీదనే ఇండ్ల పట్టాలను మంజూరు చేస్తారు. వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, పూరిగుడిసెలలో నివసించే వారికి ఇందులో ప్రాధాన్యత కల్పిస్తున్నారు. పారదర్శకత కోసం లబ్ధిదారుల ఎంపికను గ్రామసభల ద్వారా నిర్వహిస్తారు.
ఇంకా చదవండిIndiramma Housing: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు తీపికబురు.. ఒక ఇంటికి అదనంగా రూ.72,000 ఆర్థిక సాయం!
Indiramma Housing: ఈ డేటా ఎంట్రీ ప్రక్రియను వేగంగా పూర్తి చేసి, అర్హులైన లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో నేరుగా అదనపు ఆర్థిక సహాయం జమ అయ్యేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వ సాయంతో పాటు కేంద్రం నుంచి అందే ఈ అదనపు..
- Subhash Goud
- Updated on: Oct 14, 2026
- 6:40 pm