సాధారణంగా సాఫ్ట్ వేర్ ఉద్యోగులకు శని,ఆదివారాలు సెలవు ఉంటుంది. ఐదు రోజులు మాత్రమే పని దినాలు ఉంటాయి. ఇప్పుడే ఇదే పద్ధతిని భారతీయ బ్యాంకింగ్ రంగంలోనూ తీసుకొచ్చేందుకు కసరత్తు జరుగుతోంది. ఈ వార్త ఇప్పుడు బ్యాంకు ఉద్యోగుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది. బ్యాంక్ సిబ్బంది పని-జీవిత సమతుల్యతను మెరుగుపరిచే లక్ష్యంతో ఈ ప్రతిపాదనను తీసుకొచ్చినట్లు చెబుతున్నారు. అయితే ఈ వార్త బ్యాంక్ వినియోగదారులకు ఆశ్చర్యంతో పాటు ఆందోళనను కలిగిస్తోంది. వారంలో రెండు రోజులు బ్యాంకులు పనిచేయకపోతే కస్టమర్లు ఇబ్బంది పడతారని, బ్యాంక్ సేవలకు అంతరాయం ఏర్పడుతుందన్న వాదన వినిపిస్తోంది. ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) మరియు బ్యాంక్ యూనియన్లు ఈ ఐదు రోజుల పనిదినాల విధానాన్ని అంగీకరించినప్పటికీ, ప్రభుత్వం ఇంకా ప్రతిపాదనను ఆమోదించలేదు. ఐదు రోజుల పనిదినాలు నిజంగా ఆచరణ సాధ్యమైతే పరిస్థితి ఎలా ఉంటుంది. తెలుసుకుందాం రండి..
బ్యాంకులు శనివారాల్లో మూసివేసే అవకాశం ఉన్నందున, కొందరు వినియోగదారులో ఆందోళన అధికమవుతోంది. ఎందుకంటే మిగిలిన రోజుల్లో ఒకేసారి ఎక్కువ మంది బ్యాంకులకు వచ్చే అవకాశం ఉండటంతో.. అక్కడ క్యూ లైన్లు పెరగడం, వేచి ఉండే సమయం ఎక్కువయ్యే అవకాశం ఉంటుందని భయపడుతున్నారు. ఈ ఇది ఆన్‌లైన్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ ప్రాధాన్యాన్ని మరింత పెంచుతుందని కూడా విశ్లేషకులు చెబుతున్నారు. అదే సమయంలో పెరిగిన సెలవుల సంఖ్య దేశంలో బ్యాంకింగ్ కార్యకలాపాలపై ప్రభావం చూపకుండా చూసేందుకు ఈ బ్యాంకులన్నీ కొన్ని చర్యలు తీసుకోవలసి ఉంటుందని కూడా వారు చెప్పారు. రోజువారీ పని గంటలను పొడిగించడంతో పాటు డిజిటల్, ఏటీఎం సేవలను పెంచడం వంటి చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
ఒకవేళ ఐదు రోజుల పనిదినాల ప్రతిపాదన అమలులోకి వస్తే బ్యాంకులు సమయ వేళల్లో మార్పులు ఉంటాయని తెలుస్తోంది. కొన్ని నివేదికల ప్రకారం, బ్యాంకులు తమ పని సమయాలను సవరించుకుంటాయని సామాచం.. కొత్త పని గంటలు ఉదయం 9:45 నుంచి 5:30 గంటల వరకు ఉండవచ్చు. ఫలితంగా అదనపు రోజు నుంచి పని నష్టాన్ని పూడ్చడానికి రోజుకు 40 నిమిషాలు అదనంగా బ్యాంకు ఉద్యోగులు పనిచేయాల్సి ఉంటుందని చెబుతున్నారు.
డిజిటల్ బ్యాంకింగ్: వేగవంతమైన ప్రాసెసింగ్, విస్తరించిన ఆన్‌లైన్ బ్యాంకింగ్ గంటలు, మెరుగైన వినియోగదారు ఇంటర్‌ఫేస్‌ల ద్వారా వాటిని మరింత యూజర్ ఫ్రెండ్లీగా మార్చడం ద్వారా బ్యాంకులు ఆన్‌లైన్ లావాదేవీలను ప్రోత్సహించవచ్చు.
అపాయింట్‌మెంట్ ఆధారిత సేవలు: వ్యక్తిగత శ్రద్ధ అవసరమయ్యే సంక్లిష్ట లావాదేవీలు అపాయింట్‌మెంట్ సిస్టమ్ వైపునకు వెళ్లవచ్చు, ప్రతి కస్టమర్‌కు అంకితమైన సమయాన్ని కేటాయించే అవకాశం ఉంది.
వారాంతపు పనివేళల సర్దుబాటు: బ్యాంకులు మూసివేసిన శనివారాలను భర్తీ చేయడానికి వారపు రోజుల సమయాన్ని సర్దుబాటు చేయవచ్చు, ఇది సాయంత్రం ఎక్కువ సమయాన్ని అందించవచ్చు.
డిజిటల్ బ్యాంకింగ్‌ను స్వీకరించండి: బిల్లు చెల్లింపులు, బదిలీలు, ఖాతా నిర్వహణ కోసం ఆన్‌లైన్ బ్యాంకింగ్ ఫీచర్‌లతో మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోండి.
మొబైల్ యాప్‌లను ఉపయోగించుకోండి: బ్యాలెన్స్‌లను తనిఖీ చేయడం, త్వరిత బదిలీలు చేయడం వంటి ప్రయాణంలో బ్యాంకింగ్ అవసరాల కోసం మీ బ్యాంక్ మొబైల్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
ముందుగా ప్లాన్ చేయండి: వ్యక్తిగత సహాయం అవసరమయ్యే సంక్లిష్ట లావాదేవీల కోసం అపాయింట్‌మెంట్‌లను షెడ్యూల్ చేయండి.
ఆఫ్-పీక్ అవర్స్‌ను పరిగణించండి: నిరీక్షణ సమయాన్ని తగ్గించడానికి పీక్ లంచ్ అవర్స్ వెలుపల వారపు రోజులలో బ్రాంచ్‌లను సందర్శించండి.
ఇది ఈ ఏడాది చివరి నాటికి లేదా 2025 ప్రారంభంలో దీనికి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని పలువురు బ్యాంక్ ఉద్యోగులు చెబుతున్నారు. ప్రస్తుతం బ్యాంకులకు ఆదివారంతో పాటు ప్రతి రెండు, నాలుగో శనివారాలు సెలవు దినాలుగా ఉన్నాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..