ITC MAARS App: దేశంలో ఇప్పుడు రైతులు సాంకేతికతని ఉపయోగించి వ్యవసాయం చేస్తున్నారు. సంప్రదాయ వ్యవసాయం వల్ల దిగుబడి తక్కువగా రావడంతో టెక్నాలజి ఉపయోగించి దిగుమతి పెంచడానికి ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం ప్రభుత్వం కూడా యంత్రాల కొనుగోలుకి సబ్సిడీ అందిస్తోంది. అంతేకాకుండా రైతులకి సరైన సూచనలు ఇవ్వడానికి కొత్త కొత్త యాప్‌లని ప్రవేశపెడుతున్నారు. తాజాగా దేశంలోనే అతిపెద్ద వ్యాపార సంస్థ ఐటీసీ రైతుల కోసం ఓ యాప్‌ను విడుదల చేయనుంది. దీనిపేరు ITC MAARS. ఈ యాప్ వల్ల దేశంలోని రైతులకి వ్యవసాయంపై అవగాహన పెరిగి మరింత మెరుగ్గా పంటలు పండించగలరు. రైతుల సమస్యలకు మార్స్ యాప్ పరిష్కారం చూపనుంది. ఇందులో వ్యవసాయానికి సంబంధించిన మొత్తం సమాచారం ఉంటుంది. ఇందులోని సూచనలు పాటించడం ద్వారా రైతులు అధునాతన వ్యవసాయం చేయగలుగుతారు. ఈ యాప్ ద్వారా రైతులు తమ ఆదాయాన్ని ఎలా పెంచుకోవాలో తెలియజేయడంతోపాటు మెరుగైన మార్కెట్ చిట్కాలని అందిస్తారు. దీనివల్ల దాదాపు ఒక కోటి మంది రైతులకు లబ్ధి చేకూరనుంది.
ITC కంపెనీ దేశంలోని వివిధ రైతులతో కలిసి పని చేస్తోంది. దీని వల్ల రైతులకు మరింత మేలు జరుగుతుంది. ఐటీసీ మేనేజింగ్ డైరెక్టర్ సంజీవ్ పూరి మాట్లాడుతూ.. ఐటీసీ మార్స్ యాప్ అనేది వ్యవసాయ రంగంలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరినీ ఒకే వేదికపైకి తీసుకొస్తుందన్నారు. మెరుగైన మార్కెట్‌ని అందిస్తుందని తెలిపారు. భారతదేశంలో దాదాపు 1,000 లేదా అంతకంటే ఎక్కువ అగ్రి-టెక్ స్టార్టప్‌లు ఉన్నాయన్నారు. ఈ అగ్రి-టెక్ స్టార్ట్-అప్‌లతో మార్స్ కలిపి పనిచేస్తుందన్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి