
Gold vs Stock Market: గత కొంతకాలంగా బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. మీరు కూడా గడిచిన ఏడాది కాలంలో పసిడిపై పెట్టుబడి పెట్టి ఉంటే మీ ముఖంలో కచ్చితంగా నవ్వు కనిపిస్తుంది. ఎందుకంటే గత ఒక సంవత్సరంలో బంగారం ఏకంగా 35.3% భారీ రిటర్న్లను ఇచ్చి పెట్టుబడిదారులను ఆకట్టుకుంది. అదే సమయంలో స్టాక్ మార్కెట్ నిరాశపరిచింది. నిఫ్టీ 50 టోటల్ రిటర్న్ ఇండెక్స్ (Nifty 50 TRI) -5.4% ప్రతికూల (నెగెటివ్) రిటర్న్‌ను నమోదు చేసింది. ఈ భారీ తేడాను చూసి సాధారణ పెట్టుబడిదారుల మనస్సులో ఒకే ప్రశ్న మెదులుతోంది. స్టాక్ మార్కెట్ నుంచి డబ్బులు తీసేసి పూర్తిగా బంగారంలోనే పెట్టేయాలా? అని.
ఇది కూడా చదవండి: Antilia: అంబానీ ఇంట్లో ఏసీలు ఎందుకు ఉండవు..? భారీ భుకంపాలను ఎలా తట్టుకుంటుంది? ఇంటి సీక్రెట్స్ ఏంటో తెలిస్తే షాకవుతారు..!
స్వల్పకాలిక (Short term) పెట్టుబడుల విషయానికి వస్తే బంగారం అనేకసార్లు స్టాక్ మార్కెట్‌ను వెనక్కి నెట్టింది. ‘ఫండ్స్‌ఇండియా’ (FundsIndia) నివేదికల ప్రకారం… 2000 సంవత్సరం నుండి గణాంకాలను పరిశీలిస్తే, బంగారం వార్షిక రిటర్న్ చాలా హెచ్చుతగ్గులకు లోనయ్యాయి. కొన్ని సంవత్సరాలలో బంగారం స్టాక్ మార్కెట్ కంటే 79% వరకు ఎక్కువ రాబడులు ఇవ్వగా, మరికొన్ని సంవత్సరాల్లో షేర్ల కంటే 65% వెనుకబడిపోయింది.
దీర్ఘకాలిక (Long term) పెట్టుబడులలోనే అసలైన సంపద సృష్టి దాగి ఉంది. 10, 15 లేదా 20 సంవత్సరాల కాల పరిమితిని పరిశీలిస్తే కథ పూర్తిగా మారిపోతుంది.
దీర్ఘకాలంలో బంగారం ఇచ్చే సగటు వార్షిక రిటర్న్, నిఫ్టీ 50 (Nifty 50) కంటే సుమారు 2% తక్కువగా ఉంటుంది. మొదటి చూపులో ఈ 2 శాతం తేడా చాలా చిన్నదిగా అనిపించవచ్చు, కానీ కాంపౌండింగ్ (చక్రవడ్డీ) ప్రభావం వల్ల 10 నుండి 20 సంవత్సరాల వ్యవధిలో ఈ 2% తేడా మీ మొత్తం మూలధనంలో భారీ వ్యత్యాసాన్ని చూపుతుంది.
| పెట్టుబడి వ్యవధి | బంగారంలో పెట్టుబడి (Gold) | స్టాక్ మార్కెట్ (Nifty 50) | అత్యధిక లాభం దేనికి? |
| 1 సంవత్సరం | రూ.1,35,300 | రూ.94,600 | బంగారం (Gold) |
| 10 సంవత్సరాలు | రూ.2,59,370 | రూ.3,10,580 | స్టాక్ మార్కెట్ |
| 15 సంవత్సరాలు | రూ.4,17,720 | రూ.5,47,350 | స్టాక్ మార్కెట్ |
| 20 సంవత్సరాలు | రూ.6,72,750 | రూ.9,64,620 | స్టాక్ మార్కెట్ |
గమనిక: 1 ఏళ్ల లెక్కలు ఇటీవల నమోదైన రిటర్న్ల ఆధారంగా 10, 15, 20 ఏళ్ల లెక్కలు సగటున బంగారానికి 10%, స్టాక్ మార్కెట్‌కు 12% వార్షిక రిటర్న్‌ను అంచనా వేసి రూపొందించినవి).
మరి మీ డబ్బును ఎక్కడ పెట్టుబడి పెట్టాలి? ఈ ప్రశ్నకు సమాధానం రెండింటిలో ఒకదానిని ఎంచుకోవడంలో లేదు. రెండింటి మధ్య సరైన సమతుల్యత (Balance) పాటించడంలో ఉంది.
తెలివైన పెట్టుబడిదారులు తమ ప్రధాన పెట్టుబడిని స్టాక్ మార్కెట్‌లో ఉంచుతూనే, రిస్క్‌ను తగ్గించుకోవడానికి (Diversification) తమ పోర్ట్‌ఫోలియోలో కొంత శాతాన్ని (10-15%) బంగారంలో పెట్టుబడి పెడతారు. దీనివల్ల రిస్క్ తగ్గడమే కాకుండా, దీర్ఘకాలంలో స్థిరమైన లాభాలు పొందే అవకాశం ఉంటుంది.
ఇది కూడా చదవండి: Gold Price: గోల్డ్, సిల్వర్ రాకెట్ స్పీడ్.. బంగారంపై 12 వేలు.. వెండిపై రూ.15 వేలు.. పెరగడానికి కారణాలివే!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి