
లక్ష రూపాయలు. వన్ ల్యాక్ రుపీస్. తులం బంగారం కొనాలంటే లకారాన్ని దగ్గర పెట్టుకోవడానికి మానసికంగా సిద్ధంగా ఉండండి. ఎందుకంటే పసిడి ధర టాప్‌గేర్‌లో దూసుకుపోతోంది. ఇవాళ, రేపు కూడా ఈ గోల్డ్ ధరల షైనింగ్ పెరగబోతోంది? అంటూ మళ్లీ అలర్ట్ వచ్చేసింది.. అనుకున్నట్లుగానే బంగారం ధర లక్ష మార్కుకు చేరుకుంది. మార్కెట్‌లో గోల్డ్ రేట్స్ రన్ కొనసాగుతోంది.. సోమవారం ఏప్రిల్ 21 2025 నాడు కూడా బంగారం ధర భారీగా పెరిగింది.. దాదాపు రూ.950 మేర ధర పెరిగింది. హైదరాబాద్ లో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.99,500 కి చేరింది. దాదాపు 15 రోజుల్లోనే రూ.7,130 మేర ధర పెరిగింది. ఏప్రిల్ 7వ తేదీన 10 గ్రాములు రూ. 91,420 ఉండగా.. శనివారం 10 గ్రాములు రూ.98,550 చేరింది.. ఈ వారంలోనూ బంగారం ధర పెరిగే ఛాన్స్ ఉందని వ్యాపార వర్గాలు పేర్కొంటున్నాయి.. 30న అక్షయ తృతీయకు లక్ష దాటొచ్చని అంచనా వేస్తున్నారు.
బంగారం ఎడాపెడా పెరగడానికి ఒకే ఒక్క బాధ్యుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఒకవైపు సుంకాలతో బాదేస్తున్న ట్రంప్, మరోవైపు తమదేశంలోని సెంట్రల్‌బ్యాంక్‌ను కూడా టెన్షన్ పెడుతున్నారు. ట్రంప్ తీరుతో గోల్డ్‌పై పెట్టుబడికే ఇన్వెస్టర్లు మొగ్గుచూపుతున్నారు. బంగారం ధరలు ఇంకా పెరిగే ఛాన్స్ ఉందని మార్గెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి..
ప్రస్తుత ధరలు ఎలా ఉన్నాయంటే హైదరాబాద్ 24 క్యారెట్ల బంగారం ధర రూ.99వేల 500గా ఉంది. 22 క్యారెట్ల ధర 97510 గా ఉంది..
విజయవాడలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.99500, 22 క్యారెట్ల ధర 97510 గా ఉంది..
ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.98,500గా ఉండగా.. 22 క్యారెట్ల బంగారం ధర రూ.90,300 లుగా ఉంది.
ముంబైలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములు రూ.98,350గా, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములు రూ.90,150గా ఉంది.
కోల్‌కతాలో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 98,350, 22 క్యారెట్ల ధర 90,150 రూపాయలుగా ఉంది.
చెన్నైలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.98,350గా ఉండగా, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.90,150గా ఉంది.
వెండి కిలో ధర కూడా రూ.1000 మేర పెరిగి లక్ష మార్కును దాటింది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..