Gold Silver Price Today: దీపావళి పండగ వేళ మహిళలకు గుడ్‌న్యూస్‌.. తగ్గిన బంగారం ధర

దేశంలో బంగారం, వెండి ధరలు పెరిగిపోతున్నాయి. మహిళలకు అత్యంత ఇష్టమైనది బంగారం. ప్రతి రోజు ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఇక దీపావళి పండగ..

Gold Silver Price Today: దీపావళి పండగ వేళ మహిళలకు గుడ్‌న్యూస్‌.. తగ్గిన బంగారం ధర
Gold Price

Updated on: Oct 22, 2022 | 6:26 AM

దేశంలో బంగారం, వెండి ధరలు పెరిగిపోతున్నాయి. మహిళలకు అత్యంత ఇష్టమైనది బంగారం. ప్రతి రోజు ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఇక దీపావళి పండగ సమీపిస్తోంది. ధన్‌తేరాజ్‌ వస్తోంది. దీంతో ధరలు మరింతగా పెరిగే అవకాశాలు ఉండగా, తాజాగా అక్టోబర్‌ 22న బంగారం ధరలు తగ్గాయి. ఇక వెండి ధర మాత్రం స్థిరంగా కొనసాగుతోంది. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

☛ దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 బంగారం ధర రూ.46,350 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,600 ఉంది.

☛ హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,250 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,450 వద్ద కొనసాగుతోంది.

ఇవి కూడా చదవండి

☛ విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,250 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,450 ఉంది.

☛ చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.46,650 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,900 వద్ద ఉంది.

☛ దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,250, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,450 వద్ద ఉంది.

☛ కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,250 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,450 వద్ద ఉంది.

☛ బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,300 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,500 ఉంది.

☛ కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,250 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,450 వద్ద ఉంది.

వెండి ధరలు..

ఇక బంగారం ధర తగ్గుముఖం పడితే వెండి ధర మాత్రం నిలకడగా కొనసాగుతోంది. పెరిగితే.. అదే బాటలో వెండి కూడా కొనసాగుతోంది. దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధర ఇలా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ.56,150 ఉండగా, హైదరాబాద్‌లో ధర రూ.61,150 ఉంది. విజయవాడలో కిలో వెండి ధర రూ.61,150 ఉండగా, చెన్నైలో రూ.51,500 ఉంది. ముంబైలో కిలో వెండి ధర రూ.56,150 వద్ద ఉండగా, బెంగళూరులో రూ.56,150 ఉంది. ఇక కేరళలో రూ.61,500 వద్ద కొనసాగుతోంది. కాగా, దేశంలోని ఇతర నగరాల్లో దాదాపు ఇదే ధరలు కొనసాగుతున్నాయి. జీఎస్టీ, టీసీఎస్, ఇతరత్రా పన్నుల కారణంగా ఆయా నగరాల్లోని బంగారం రేట్లలో కొంత హెచ్చుతగ్గులు ఉండొచ్చునని గమనించాలి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం చూడండి..