Gold Silver Price Today: ప్రతి రోజు బంగారం, వెండి ధరల్లో హెచ్చు తగ్గులు చోటు చేసుకుంటూనే ఉంటాయి. ఒక రోజు రేట్లు పెరిగితే.. మరో రోజు తగ్గుముఖం పడతాయి. లేదా స్థిరంగా కొనసాగుతాయి. అయితే పసిడి ధరలు ఎంత పెరిగినా.. బంగారం షాపులన్ని కొనుగోలుదారులతో కిటకిటలాడుతూనే ఉంటాయి. ఇక పెళ్లిళ్ల సీజన్‌లో అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా దేశంలో జూలై 25న బంగారం, వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. భారత్‌లోని ప్రధాన నగరాల్లో రేట్ల వివరాలు ఇలా ఉన్నాయి.
చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,960 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.51,230 ఉంది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.46,900 వద్ద ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.51,160 ఉంది. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,900 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.51,160 ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.46,900 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.51,160 ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల ధర రూ.46,950 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,210 వద్ద కొనసాగుతోంది. ఇక హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,900 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.51,160 వద్ద ఉంది. ఇక విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,900 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.51,160 వద్ద ఉంది. విశాఖలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,900 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,160 వద్ద ఉంది.
వెండి ధరలు:
బంగారం బాటలోనే వెండి కూడా పయనిస్తోంది. ధరల్లో ఎలాంటి మార్పులేదు. స్థిరంగా కొనసాగుతోంది. చెన్నైలో కిలో వెండి ధర రూ.61,200 ఉండగా, ముంబైలో రూ.55,100, ఢిల్లీలో రూ.55,100, కోల్‌కతాలో రూ.55,100, బెంగళూరులో రూ.61,200, హైదరాబాద్‌లో రూ.61,200, విజయవాడలో రూ.61,200 ఉంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి