Gold Price Today: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. మళ్లీ తగ్గిన బంగారం ధరలు.. తులం బంగారం ఎంత ఉందంటే..?

బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. ఇటీవల కాలంలో భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. కొన్ని రోజుల నుంచి క్రమంగా దిగొస్తున్నాయి. తాజాగా.. బంగారం ధరలు స్వల్పంగా తగ్గగా.. వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. గురువారం ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర..

Gold Price Today: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. మళ్లీ తగ్గిన బంగారం ధరలు.. తులం బంగారం ఎంత ఉందంటే..?
Gold Price Today

Updated on: Aug 17, 2023 | 6:26 AM

Gold and Silver Latest Prices: బంగారం, వెండికి ఎప్పుడూ డిమాండే ఉంటుంది. పెళ్లిళ్లు, శుభకార్యాలు.. పండుగలు ఇలా ఎలాంటి కార్యక్రమాలున్నా.. చాలా మంది బంగారం, వెండిని కొనుగోలు చేస్తుంటారు. అందుకే బంగారం, వెండి ధరలపై అందరూ ఓ కన్నేసి ఉంచుతారు. అయితే, ప్రపంచవ్యాప్తంగా చోటుచేసుకుంటున్న పరిణామాల ప్రకారం.. బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. ఇటీవల కాలంలో భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. కొన్ని రోజుల నుంచి క్రమంగా దిగొస్తున్నాయి. తాజాగా.. బంగారం ధరలు స్వల్పంగా తగ్గగా.. వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. గురువారం ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.54,450 గా ఉంటే, 24 క్యారెట్ల పదిగ్రాముల పసిడి ధర రూ.59,400 లుగా ఉంది. తాజాగా 10 గ్రాముల బంగారంపై రూ.110 మేర ధర తగ్గింది. కిలో వెండి ధర రూ.200 మేర పెరిగి రూ.73,000 లుగా కొనసాగుతోంది. దేశంలోని ప్రధాన నగరాలు, తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో పసిడి, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..

దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల బంగారం ధర రూ.54,600 లుగా ఉంటే.. 24 క్యారెట్ల ధర రూ.59,550 గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.54,450, 24 క్యారెట్లు రూ.59,400 గా ఉంది. చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.54,950, 24 క్యారెట్ల ధర రూ.59,950, బెంగళూరులో 22 క్యారెట్ల ధర రూ.54,450, 24 క్యారెట్ల బంగారం ధర రూ.59,400, కేరళలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.54,450, 24 క్యారెట్ల ధర రూ.59,400, కోల్‌కతాలో బంగారం 22 క్యారెట్ల ధర రూ.54,450, 24 క్యారెట్ల ధర రూ.59,400గా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు..

హైదరాబాద్ నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.54,450 ఉంటే.. 24 క్యారెట్ల ధర రూ.59,400 లుగా ఉంది. విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో 22 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.54,450 ఉండగా.. 24 క్యారెట్ల ధర బంగారం రూ.59,400 లుగా ఉంది.

ఇవి కూడా చదవండి

ప్రధాన నగరాల్లో వెండి ధరలు..

దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ.73,000 లుగా కొనసాగుతోంది. చెన్నైలో కిలో వెండి ధర రూ.76,200 ఉంటే.. ముంబైలో కిలో వెండి ధర రూ.73,000 లుగా ఉంది. కేరళలో కిలో వెండి ధర రూ.76,200 ఉంది. బెంగళూరులో రూ.72,000, కోల్‌కతాలో కిలో వెండి ధర రూ.73,000 లుగా ఉంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.76,200, విశాఖపట్నం, విజయవాడలో రూ.76,200 లుగా కొనసాగుతోంది.

గమనిక..

బంగారం, వెండి ధరలు బులియన్ మార్కెట్ వెబ్‌సైట్‌లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి.. అయితే, ఈ ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు, చేర్పులు జరిగే అవకాశం ఉంటుంది.. కావున, కొనేముందు ఒకసారి పరిశీలించి వెళ్లడం మంచిది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us