Gold Price Today
Gold, Silver Price Today: దేశంలో ప్రతి రోజు పసిడి ధరలలో మార్పులు ఉండటనే ఉంటాయి. ఒక రోజు ధర తగ్గితే మరో రోజు పెరుగుతుంది. మన భారతీయ సాంప్రదాయంలో పసిడికి మహిళలు అత్యంత ప్రాధాన్యత ఇస్తుంటారు. ధర ఎంత పెరిగినా బంగారం షాపులన్ని కస్టమర్లతో కిటకిటలాడుతుంటాయి. ఇక పెళ్లిళ్ల సీజన్‌లో మాత్రం వేరే చెప్పాల్సిన అవసరం లేదు. జోరుగా విక్రయాలు కొనసాగుతుంటాయి. అయితే తాజాగా సోమవారం దేశంలో బంగారం, వెండి ధరల్లో ఎలాంటి మార్పు లేదు. ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఇక ఆగస్టు 8న (సోమవారం) దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.
- తెలంగాణలోని హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,450 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.52,850 వద్ద ఉంది.
- ఏపీలోని విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,450 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,850 ఉంది.
- తమిళనాడులోని చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.48,450 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,850 వద్ద ఉంది.
- మహారాష్ట్రలోని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,550 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,870
- దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,700 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,030 వద్ద ఉంది.
- పశ్చిమబెంగాల్ రాజధాని కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,700 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,870 ఉంది.
- కర్ణాటక రాజధాని బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,600 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,930 ఉంది.
- కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,550 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,870 వద్ద ఉంది.
ఇక వెండి ధరల విషయానికొస్తే..
హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.63,000, విజయవాడలో రూ.63,000, చెన్నైలో రూ.63,000, ముంబైలో రూ.57,400, ఢిల్లీలో రూ.57,400, కోల్‌కతాలో రూ.57,400, బెంగళూరులో రూ.63,000, కేరళలో కిలో వెండి ధర రూ.63,000 వద్ద కొనసాగుతోంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..