Gold Silver Price Today: మహిళలకు గుడ్‌న్యూస్.. తగ్గిన బంగారం, వెండి ధరలు

|

Mar 29, 2022 | 5:58 AM

Gold Silver Price Today: బంగారం, వెండి ధరల్లో ప్రతి రోజు మార్పులు జరుగుతూనే ఉంటాయి. భారతీయులు అత్యంత ప్రాధాన్యతనిచ్చే బంగారం ధరలు పరుగులు..

Gold Silver Price Today: మహిళలకు గుడ్‌న్యూస్.. తగ్గిన బంగారం, వెండి ధరలు
Gold Silver Price
Follow us on

Gold Silver Price Today: బంగారం, వెండి ధరల్లో ప్రతి రోజు మార్పులు జరుగుతూనే ఉంటాయి. భారతీయులు అత్యంత ప్రాధాన్యతనిచ్చే బంగారం ధరలు పరుగులు పెడుతున్నాయి. ఇక ఉక్రెయిన్‌ (Ukraine) – రష్యా  (Russia)యుద్ధాల (Ukraine-Russia War) కారణంగా భారీగా పెరుగుతున్నాయి. తాజాగా మంగళవారం (March 29) బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు పేర్కొంటున్నారు. బంగారం, వెండి కొనుగోలు చేసే ముందు ఎంత ధర ఉందో తెలుసుకుని వెళ్లడం మంచిది. తాజాగా దేశీయంగా ధరల (Rate) వివరాలు ఇలా ఉన్నాయి.

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు:

☛ చెన్నై: 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,160 ఉండగా, 24 క్యారెట్ల పసిడి ధర రూ.52,650 వద్ద నమోదవుతోంది.

☛ ముంబై: 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,950 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,310 వద్ద ఉంది.

☛ ఢిల్లీ: 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,950 ఉండగా, 24 క్యారెట్ల పసిడి ధరలు రూ.52,550 ఉంది.

☛ కోల్‌కతా: 22 క్యారెట్ల పసిడి ధర రూ.47,950 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.52,310 ఉంది.

☛ బెంగళూరు: 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,950 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.52,310 ఉంది.

☛ హైదరాబాద్‌: 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.47,950 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,310 వద్ద ఉంది.

☛ విజయవాడ: 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,950 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,310 ఉంది.

☛ కేరళ: 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,950 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,310 వద్ద ఉంది.

వెండి ధరలు:

ఇక బంగారం లాగే వెండి కూడా పరుగులు పెడుతోంది. దేశీయంగా కిలో బంగారంపై 600లకుపైగా పెరిగింది. చెన్నైలో కిలో వెండి ధర రూ.72,700 ఉండగా, ముంబైలో రూ.68,400 ఉంది. ఢిల్లీలో కిలో వెండి ధర రూ.68,400 ఉండగా, కోల్‌కతాలో రూ.68,400 ఉంది. ఇక బెంగళూరులో కిలో వెండి ధర రూ.72,700 ఉండగా, హైదరాబాద్‌లో రూ.72,700 ఉంది. విజయవాడలో కిలో వెండి ధర రూ.72,700 ఉండగా, కేరళలో రూ.72,700 వద్ద కొనసాగుతోంది.

ఇవి కూడా చదవండి

Home Loan: హోం లోన్‌ ఈఎంఐ చెల్లించకపోతే ఏమవుతుంది.. బ్యాంకులు ఏం చేస్తాయి..

Indian Railways: రైల్వే ప్రయాణికులకు గమనిక.. ఈ విషయంలో మీకు నష్టపరిహారం అందుతుంది..!