Gold Silver Price Today: పసిడి ప్రియులకు షాక్.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. వెండి రేటు ఎంత ఉందంటే?

|

May 25, 2022 | 6:52 AM

కొన్ని రోజుల నుంచి తగ్గుతూ వస్తున్న బంగారం, వెండి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. తాజాగా.. బంగారం ధరలు పెరగగా.. వెండి ధరలు తగ్గాయి.

Gold Silver Price Today: పసిడి ప్రియులకు షాక్.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. వెండి రేటు ఎంత ఉందంటే?
Gold Silver Price
Follow us on

Latest Gold Silver Prices: బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరల్లో నిత్యం మార్పులు జరుగుతాయన్న విషయం తెలిసిందే. వాస్తవానికి కొన్ని రోజుల నుంచి తగ్గుతూ వస్తున్న బంగారం, వెండి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. తాజాగా.. బంగారం ధరలు పెరగగా.. వెండి ధరలు తగ్గాయి. బుధవారం ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి (తులం బంగారం) ధర మార్కెట్లో రూ.47,750 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,090 గా ఉంది. బంగారం 22 క్యారెట్లపై రూ.600, 24 క్యారెట్లపై 660 మేర ధర పెరిగింది. దేశీయంగా కిలో వెండి (Silver Rate) ధర రూ.500 మేర తగ్గి.. రూ.61,600 లుగా ఉంది. బులియన్ మార్కెట్ ప్రకారం.. దేశంలోని ప్రధాన నగరాల్లో, తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం..

ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.47,750 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,090 గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,750 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.52,090 గా ఉంది. చెన్నై నగరంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,350, 24 క్యారెట్ల ధర రూ.52,750 వద్ద కొనసాగుతోంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,750 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.52,090 ఉంది. కేరళలో 22 క్యారెట్ల ధర రూ.47,750 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.52,090గా ఉంది.

ఇవి కూడా చదవండి

తెలుగు రాష్ట్రాల్లో ధరలు..

తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,750 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,090 వద్ద కొనసాగుతోంది. విజయవాడలో 22 క్యారెట్ల ధర రూ.47,750 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.52,090 ఉంది. విశాఖపట్నంలో 22 క్యారెట్ల ధర రూ.47,750 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.52,090 గా ఉంది.

వెండి ధరలు..

ఢిల్లీలో కిలో వెండి ధర రూ.61,600 గా ఉంది. ముంబైలో కిలో వెండి ధర రూ.61,600 ఉండగా.. చెన్నైలోలో కిలో వెండి ధర రూ.66,100 ఉంది. బెంగళూరులో రూ.66,100, కేరళలో రూ.66,100 లుగా కొనసాగుతోంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.66,100, విజయవాడలో రూ.66,100, విశాఖపట్నంలో రూ.66,100 లుగా కొనసాగుతోంది.

కాగా.. ఈ ధరలు బులియన్‌ మార్కెట్‌ వెబ్‌సైట్లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి. అయితే.. జాతీయం, అంతర్జాతీయంగా చోటు చేసుకున్న పరిణామాల ప్రకారం బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు చేర్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. కావున మీరు కొనుగోలు చేసే ముందు ఒకసారి ధరలు పరిశీలించి వెళ్లడం మంచిది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..