Gold Price Today: గుడ్ న్యూస్.. స్వల్పంగా తగ్గిన పసిడి, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో రేట్లు ఎలా ఉన్నాయంటే..

|

Mar 16, 2024 | 6:34 AM

పుత్తడి ధరలు ఆకాశన్నంటుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా బంగారం ధరలు రికార్డులు బద్దలు కొడుతున్నాయి. ప్రస్తుతం 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర అక్షరాలా 66 వేల మార్క్ దాటింది. అయితే, పెళ్లిళ్ల సీజన్ కావడంతో ధరతో ప్రమేయం లేకుండా అమ్మకాలు జరుగుతున్నాయి. అటు.. బంగారంపై ఇన్వెస్ట్‌మెంట్‌ అనేది ఒక సెంటిమెంట్‌గా మారిందంటున్నారు వ్యాపారులు..

Gold Price Today: గుడ్ న్యూస్.. స్వల్పంగా తగ్గిన పసిడి, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో రేట్లు ఎలా ఉన్నాయంటే..
Gold Price Today
Follow us on

పుత్తడి ధరలు ఆకాశన్నంటుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా బంగారం ధరలు రికార్డులు బద్దలు కొడుతున్నాయి. ప్రస్తుతం 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర అక్షరాలా 66 వేల మార్క్ దాటింది. అయితే, పెళ్లిళ్ల సీజన్ కావడంతో ధరతో ప్రమేయం లేకుండా అమ్మకాలు జరుగుతున్నాయి. అటు.. బంగారంపై ఇన్వెస్ట్‌మెంట్‌ అనేది ఒక సెంటిమెంట్‌గా మారిందని, దాన్ని ఎవరూ ఆపలేరని ధీమాతో ఉన్నారు జ్యుయెలరీ వ్యాపారులు.. ఈ తరుణంలోనే కొన్ని రోజులు ముహూర్తాలు లేకపోయినా.. బంగారం ధరలకు బ్రేక్ పడదని వ్యాపారులు పేర్కొంటున్నారు. క్రమంగా స్వర్ణం ధరలు మాత్రం పరుగులు తీస్తాయని వ్యాపార నిపుణులు పేర్కొంటున్నారు. తాజాగా.. బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. మార్చి 16, 2024 శనివారం ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం, పది గ్రాముల పసిడిపై రూ.10, కిలో వెండిపై రూ.100 మేర తగ్గింది.

దేశంలోని ప్రధాన నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి..

ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.60,740, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.66,250 గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.60,590, 24 క్యారెట్ల ధర రూ.66,100, చెన్నైలో 22 క్యారెట్ల రేట్ రూ.61,240, 24 క్యారెట్ల రేటు రూ.66,810, బెంగళూరులో 22 క్యారెట్లు రూ.60,590, 24 క్యారెట్ల ధర రూ.66,100, కేరళలో 22 గోల్డ్ రేట్ రూ.60,590, 24 క్యారెట్ల ధర రూ.66,100, హైదరాబాద్‌లో 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ.60,590, 24 క్యారెట్లు రూ.66,100, విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,590, 24 క్యారెట్ల పసిడి రేట్ రూ.66,100

వెండి ధరలు ఇలా..

  • హైదరాబాద్‌లో వెండి కిలో ధర రూ.79,900 లుగా ఉంది
  • విజయవాడలో రూ.79,900
  • విశాఖపట్నంలో రూ.79,900
  • చెన్నైలో రూ.79,900
  • ఢిల్లీలో రూ.76,900
  • ముంబైలో రూ.76,900
  • కేరళలో రూ.79,900
  • బెంగళూరులో రూ.76,100 గా ఉంది..