Gold Rates Hike: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఎఫెక్ట్.. ఒక్కసారిగా జంప్ అయిన గోల్డ్ రేట్.. ప్రస్తుత ధర ఎంతంటే..!

|

Feb 24, 2022 | 4:16 PM

Gold Rates Hike: ఉక్రెయిన్ రష్యా మధ్య యుద్ధం మార్కెట్లపై పెను ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా పసిడి ధరలను తీవ్రంగా ప్రభావితం చేసింది. ఉక్రెయిన్, రష్యా క్రైసిస్ కారణంగా..

Gold Rates Hike: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఎఫెక్ట్.. ఒక్కసారిగా జంప్ అయిన గోల్డ్ రేట్.. ప్రస్తుత ధర ఎంతంటే..!
Follow us on

Gold Rates Hike: ఉక్రెయిన్ రష్యా మధ్య యుద్ధం మార్కెట్లపై పెను ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా పసిడి ధరలను తీవ్రంగా ప్రభావితం చేసింది. ఉక్రెయిన్, రష్యా క్రైసిస్ కారణంగా బంగారం ధరలు ఒక్కసారిగా జంప్ అయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్ బంగారం ధర 1934 డాలర్లు దాటింది. భారత్‌లోనూ దీని ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. దేశీయ మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,400 మేర పెరిగింది. దాంతో ప్రస్తుతం 10 గ్రాముల బంగారం ధర రూ. 51,750 దాటింది. వాస్తవానికి ప్రపంచ ఉద్రిక్తతల కారణంగా అన్ని వస్తువల ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ ప్రభావం బంగారంపైనా పడింది.

10 గ్రాముల బంగారం ధర 60,000 రూపాయలకు చేరే అవకాశం..
ప్రపంచ ఉద్రిక్తతల కారణంగా అన్ని వస్తువుల ధరలు పెరుగుతున్నాయి. ముడి చమురు బ్యారెల్‌ ధర 100 డాలర్లు దాటింది. దాంతోపాటే బంగారం ధరలు కూడా విపరీతంగా పెరుగుతున్నాయి. రష్యా, ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతలు ఇలాగే కొనసాగితే బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. 24 క్యారెట్స్ 10 గ్రాముల బంగారం ధర త్వరలోనే రూ.60,000 లకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు.

బంగారం ధరలే ఎందుకు పెరుగుతాయి?
వాస్తవానికి ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం ఇప్పటికే పెరిగిపోయింది. దీనికి తోడు ముడి చమురు ధరల పెరుగుదల కారణంగా ద్రవ్యోల్బణం మరింత పెరిగే అవకాశం ఉంది. అదే జరిగితే.. వివిధ దేశాల సెంట్రల్ బ్యాంకులు ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి వడ్డీ రేట్లను పెంచే అవకాశం ఉంది. ఈ ఎపిసోడ్‌లో ఆర్‌బీఐ కూడా వడ్డీ రేట్లను పెంచే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో స్టాక్ మార్కెట్లో పతనమయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. వీటన్నింటిని బేరీజు వేసుకుని పెట్టుబడిదారులు తమ సంపదను బంగారంలో పెట్టుబడిగా పెట్టే అవకాశం ఉంది. అలా బంగారానికి డిమాండ్ పెరిగి.. పసిడి ధరలకు రెక్కలు వచ్చే ఛాన్స్ ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

Also read:

Viral Video: ప్రపంచం మొత్తం చూపు ఆ జర్నలిస్ట్ పైనే.. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై ఆరు భాషల్లో న్యూస్..

Ajith’s Valimai : వలిమై థియటర్ వద్ద పెట్రోల్ బాంబు దాడి.. అజిత్ ఫ్యాన్స్‌కు తీవ్రగాయాలు

Valimai Movie Review: యాక్షన్‌ ప్రియులకు నచ్చే సినిమా ‘వలిమై’.. మూవీ రివ్యూ