
భారతీయ మహిళలకు బంగారం అంటే ఎంత ఇష్టం ఉంటుందో చెప్పక్కర్లేదు. ధర పెరిగినా.. తగ్గినా ఏమాత్రం లెక్కచేయకుండా కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. ఇక ఇప్పుడు పెళ్లి్ళ్ల సీజన్ కావడంతో శుభకార్యాల కోసం బంగారం విక్రయాలు మరింత పెరిగాయి. మరోవైపు గత కొన్ని రోజులుగా పసిడి ధరలు పరుగులు పెడుతున్నాయి. ఇటీవల బంగారం ధర లక్షకు చేరి పసిడి ప్రియులకు షాకిచ్చిన సంగతి తెలిసిందే. కానీ వారం రోజులుగా గోల్డ్ రేట్స్ నెమ్మదిగా దిగివస్తున్నాయి. నాలుగైదు రోజుల క్రితం భారీగా పడిపోయిన పసిడి ధరలు గత మూడు రోజులుగా స్వల్పంగా తగ్గుతున్నాయి. ఇప్పుడిప్పుడే దేశీయ మార్కెట్లో గోల్డ్ రేట్స్ తగ్గుముఖం పట్టాయి. దీంతో దేశంలోని పలు ప్రధాన నగరాలు ముంబై, ఢిల్లీ, హైదరాబాద్ వంటి ప్రాంతాల్లోనూ బంగారం ధరలలో మార్పులు చోటు చేసుకున్నాయి. శనివారం తెల్లవారుజామున దేశీయ మార్కెట్లో బంగారం వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందామా… ?
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు..
హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధరలు మరోసారి స్వల్పంగా తగ్గాయి. శుక్రవారం 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ.95,510 ఉండగా.. ఈరోజు ఉదయం స్వల్పంగా తగ్గి రూ.95,500కు చేరింది. అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ.87,540 వద్ద కొనసాగుతుంది. హైదరాబాద్‌తోపాటు విజయవాడ, విశాఖపట్నం, నెల్లూరు, నిజామాబాద్, వరంగల్ వంటి నగరాల్లోనూ ఇవే పసిడి ధరలు కొనసాగుతున్నాయి.
పలు నగరాల్లో బంగారం ధరలు..
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..