AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Price Today: బంగారం, వెండి ధరల్లో స్వల్ప మార్పులు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?

కొనుగోలు దారులకు మరోసారి బంగారం, వెండి ధరలు షాక్ ఇచ్చాయి. గత రెండు మూడు రోజులుగా వరుసగా పెరుగుతూ వస్తున్న బంగారం, వెండి ధరలు పసిడి ప్రియులకు అందని ద్రాక్షలా మారుతున్నాయి. తాజాగా సోమవారం మరోసారి బంగారం ధరలు భారీ మార్పులు కనిపించాయి. ఆదివారంతో పోల్చుకుంటే సోమవారం బంగారం, వెండి ధరల్లో వందల రూపాయల ఛేంజ్ కనిపించింది. కాబట్టి ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల సహా దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

Gold Price Today: బంగారం, వెండి ధరల్లో స్వల్ప మార్పులు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?
జనవరిలో బంగారం ధరలు పెరిగి, గ్రాముకు రూ. 16,000 పైగా అమ్ముడైనప్పటికీ, మార్చి నుండి జూలై వరకు బంగారం ధరలు మందకొడిగా ఉన్నాయి. ముఖ్యంగా జూన్‌లో నిరంతర క్షీణత తర్వాత, బంగారం గ్రాముకు రూ. 13,000కు అమ్ముడైంది. ఈ పరిస్థితిలో జూలైలో స్వల్ప ధర పెరుగుదలను చూసిన బంగారం.. ఆగస్టులో నిరంతరం పెరుగుతోంది.
Anand T
|

Updated on: Jul 20, 2026 | 10:02 AM

Share

పసిడి ప్రియులకు బంగారం, వెండి ధరలు వరుస షాక్‌లు ఇస్తున్నాయి.గత రెండ్రోజులుగా ఈ ఆభరణాల ధరలు బ్రేకుల్లేని బండిలా పరుగులు పెడుతూనే ఉన్నాయి. తాజాగా సోమవారం కూడా బంగారం, వెండి ధరలు పుంజుకున్నాయి. అంతర్జాతీయ పరిణామాలు, డాలర్, రూపాయి విలువ మారకం ప్రభావంతోనే బంగారం, వెండి ధరల్లో ఈ మార్పులు చోటుచేసుకుంటున్నాయని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. ఆదివారంతో పోల్చుకుంటే సోమవారం ఉదయం 10 గంటలకు హైదరాబాద్‌లో 24 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,43,460గా ఉండగా నిన్న ఈ ధర రూ..1,43,290 వద్ద స్థిరపడింది. అంటే తులం బంగారంపై రూ.170 పెరిగింది. ఇక 22 క్యాటర్ల బంగారం ధర చూసుకుంటే.. రూ.1,31,500 వద్ద ట్రేడవుతుంది. నిన్నటితో పోల్చుకుంటే దీని ధర రూ.150 పెరిగింది. ఇక వెండి విషయానికి వస్తే.. రూ. 2,34,900గా ఉంది.

ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

  • హైదరాబాద్‌లో గోల్డ్ 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,43,460, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,31,500 గా ఉంది. వెండి కిలో ధర రూ.2,34,900 ఉంది.
  • విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.1,43,460, 22 క్యారెట్ల గోల్డ్ 10గ్రాముల ధర రూ.1,31,500 ఉంది. వెండి కిలో ధర రూ.2,34,900 ఉంది.
  • ఢిల్లీలో 24 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల ధర రూ.1,43,610, 22 క్యారెట్ల ధర రూ.1,31,650 గా ఉంది. వెండి కిలో ధర రూ.2,35,000 ఉంది.
  • ముంబైలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,43,460, 22 క్యారెట్ల ధర రూ.1,31,500 గా ఉంది. వెండి కిలో ధర రూ.2,34,900 లుగా ఉంది.
  • చెన్నైలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.143,460, 22 క్యారెట్ల ధర రూ.1,31,500 ఉంది. వెండి కిలో ధర రూ.2,34,900 ఉంది.
  • బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,43,460, 22 క్యారెట్ల ధర రూ.1,31,500 ఉంది. వెండి కిలో ధర రూ.2,35,000 లుగా ఉంది.

కొనే ముందు ఇది గమనించండి

అయితే అంతర్జాతీయ పరిణామాలు, డాలర్ విలువ మారకం వల్ల ఎప్పకప్పుడూ బంగారం, వెండి ధరల్లో మార్పులు జరుగుతూ ఉంటాయి. అలాగే ప్రాంతాలను బట్టి కూడా ఈ ఆభరణాల ధరల్లో వ్యత్యాసాలు ఉంటాయి. ఎందుకంటే స్థానిక డిమాండ్, సరఫరా, అలాగే రాష్ట్ర పన్నులు, తదితర అంశాల కారణంగా వీటి ధరలు మారుతూ ఉంటాయి. కాబట్టి మీరు బంగారం కొనే ప్లాన్‌లో ఉంటే.. ముందు లేటెస్ట్ ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలి. ఇందుకోసం అధికారిక వెబ్‌సైట్ లేదా..ఈ మొబైల్ నెంబర్‌కు 8955664433కు మిస్డ్ కాల్ ఇవ్వవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
అకౌంట్ తెరవాలంటే రూ.200 ఛార్జీ.. కేంద్రం కొత్త రూల్స్..
అకౌంట్ తెరవాలంటే రూ.200 ఛార్జీ.. కేంద్రం కొత్త రూల్స్..
అడవిని వీడి తోటలోకి వచ్చిన ఏనుగు.. అంతలోనే విషాదం
అడవిని వీడి తోటలోకి వచ్చిన ఏనుగు.. అంతలోనే విషాదం
ఆ చేపలు తినొద్దు.. నేపాల్ వరద నీటిలో కొట్టుకొస్తున్న భారీ చేపలు!
ఆ చేపలు తినొద్దు.. నేపాల్ వరద నీటిలో కొట్టుకొస్తున్న భారీ చేపలు!
టెక్నో స్పార్క్ గో 3 ప్రో డిస్‌ప్లే, బ్యాటరీ సహా పూర్తి వివరాలు
టెక్నో స్పార్క్ గో 3 ప్రో డిస్‌ప్లే, బ్యాటరీ సహా పూర్తి వివరాలు
ఒక్క రోజులోనే 10వేలు డైన్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు!
ఒక్క రోజులోనే 10వేలు డైన్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు!
ఆ రోజే అకౌంట్లోకి తల్లికి వందనం నిధులు.. ప్రభుత్వం నుంచి అప్డేట్
ఆ రోజే అకౌంట్లోకి తల్లికి వందనం నిధులు.. ప్రభుత్వం నుంచి అప్డేట్
కార్బన్ జెన్‌జె ప్రో స్మార్ట్‌ఫోన్ పూర్తి వివరాలివే
కార్బన్ జెన్‌జె ప్రో స్మార్ట్‌ఫోన్ పూర్తి వివరాలివే
ఫాస్టెస్ట్ బాల్ వేసినోడు తెలుసు.. ఆడిన మొగోడు ఎవడో తెలుసా?
ఫాస్టెస్ట్ బాల్ వేసినోడు తెలుసు.. ఆడిన మొగోడు ఎవడో తెలుసా?
సైన్స్ కు అందని కదిరి లక్ష్మీనరసింహస్వామి శ్వేద రహస్యం
సైన్స్ కు అందని కదిరి లక్ష్మీనరసింహస్వామి శ్వేద రహస్యం
నిజమైన దెయ్యం సినిమా.. ఓటీటీలో ఎక్కువమంది చూసిన హారర్ థ్రిల్లర్
నిజమైన దెయ్యం సినిమా.. ఓటీటీలో ఎక్కువమంది చూసిన హారర్ థ్రిల్లర్