Gold and silver rate: తగ్గేదే లే అంటున్న బంగారం..రోజు రోజుకూ షాకిస్తోంది.. తులం ఎంతంటే..

భారతదేశంలో బంగారం, వెండి ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. 2025 నుండి నిరంతర పెరుగుదలతో, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.1,38,560కు చేరింది. శుభప్రదంగా, పెట్టుబడిగా భావించే పసిడి సామాన్యులకు దూరం అవుతుందేమోనని ఆందోళన పెరుగుతోంది. నేటి తాజా ధరలు, పెరుగుదలకు గల కారణాలపై ఈ కథనం.

Gold and silver rate: తగ్గేదే లే అంటున్న బంగారం..రోజు రోజుకూ షాకిస్తోంది.. తులం ఎంతంటే..
Today Gold

Updated on: Dec 24, 2025 | 7:29 AM

మామూలుగానే అందరూ పసిడి ప్రియులే.. ఆడ మగ అనే తేడా లేదు.. బంగారం ధరించేందుకు ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు. ఇకపోతే, భారతదేశంలో బంగారాన్ని శుభప్రదంగా భావిస్తారు. అలాగే, మంచి పెట్టుబడి వనరుగా కూడా ఉపయోగిస్తున్నారు. ఈ క్రమంలోనే బంగారం ధర కూడా భారీగా పెరిగిపోతోంది. ఈ యేడు పసిడి ధర ఎప్పుడూ లేనంతగా పెరిగిపోయింది. 2025 ప్రారంభం నుండి బంగారం, వెండి ధరలు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. ఒకరోజు 10 నుంచి 20 రూపాయలు తగ్గితే.. ఆ వెంటనే వెయ్యి నుంచి రెండు మూడు వేలకు పెరుగుతుంది. ప్రస్తుత ధరలు చూస్తుంటే.. ఇకపై బంగారం సామాన్యులకు మ్యూజియంలో వస్తువుగా మారుతుందేమో అన్న సందేహం కలుగుతుంది.

భారతదేశంలో ఈరోజు 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు రూ.1,38,560లకు చేరింది. అదే 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు రూ.1,27,010లుగా ఉంది. అలాగే, పసిడి బాటలోనే వెండి కూడా పయనించింది. ఇవాళ్టి వెండి ధర గ్రాము రూ.234.10లు పలుకుతోంది. ఇక కిలో వెండి ధర రూ. 2,34,100ల గిరష్టానికి చేరింది.

ఇకపోతే, నేడు డిసెంబర్‌ 24వ తేదీ బుధవారం బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

చెన్నైలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,39,320 లు ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,16,290 గా ఉంది. వెండి కిలో ధర రూ.2,34,100 లుగా ఉంది.

ముంబైలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,38,560, 22 క్యారెట్ల ధర రూ.1,27,010 గా ఉంది. వెండి కిలో ధర రూ.2,23,100 లుగా ఉంది.

ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,38,710, 22 క్యారెట్ల ధర రూ.1,27,160 గా ఉంది. వెండి కిలో ధర రూ.2,23,100 లుగా ఉంది.

హైదరాబాద్‌లో 24 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల ధర రూ.1,38,560, 22 క్యారెట్ల ధర రూ.1,27,010 గా ఉంది. కిలో వెండి ధర రూ.2,34,100 లుగా ఉంది.

విజయవాడలో 24 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల ధర రూ.1,38,560, 22 క్యారెట్ల ధర రూ.1,27,010 గా ఉంది. కిలో వెండి ధర రూ.2,34,100 లుగా ఉంది.

విశాఖపట్నంలో 24 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల ధర రూ.1,38,560, 22 క్యారెట్ల ధర రూ.1,27,010 గా ఉంది. కిలో వెండి ధర రూ.2,34,100 లుగా ఉంది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు ఉదయం 8 గంటలలోపు అందిన సమాచారం మేరకు మాత్రమే. ధరలు ప్రతి క్షణం మారవచ్చు. అందువల్ల బంగారం కొనుగోలుదారులు ఇచ్చిన సమయంలో ప్రత్యక్ష ధరలను ట్రాక్ చేయాలి. ఇక్కడ పేర్కొన్న ధరలు నిన్నటి ముగింపు ధరలు అయితే నేటి ధర తగ్గుదలతో లేదా పెరుగుదలతో ప్రారంభమవుతుంది. అలాగే, అన్ని నగరాల్లో ఈ ధరలు ఒకే విధంగా ఉండవు. స్థానిక డిమాండ్, సరఫరా, అలాగే రాష్ట్ర పన్నులు, తదితర అంశాల ప్రకారం ఎప్పటికప్పుడు మారుతుంటాయి.. అందుకే అన్ని ప్రధాన నగరాల్లో కూడా ధరల్లో వ్యత్యాసాలు ఉంటాయి. ఒకవేళ మీకు బంగారం, వెండి ధరల లేటెస్ట్ అప్‌డేట్ గురించి తెలుసుకోవాలంటే ఈ మొబైల్ నెంబర్‌కు 8955664433కు మిస్డ్ కాల్ ఇవ్వవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..