Gold Rate Today: గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం ధర.. తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉన్నాయంటే?

Gold Price Rate: బంగారం ధరలు రోజురోజుకు పెరుగుతూ పోతున్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 82వేలు దాటింది. లక్ష మార్క్ చేరుతుందని అంటున్నారు. ఈ క్రమంలో 24 జనవరి ఉదయం బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..

Gold Rate Today: గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం ధర.. తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉన్నాయంటే?
Gold Price

Updated on: Jan 24, 2025 | 7:20 AM

Gold Rate Today: బంగారం అంటే తెలుగు ప్రజలు ఎంత మక్కువో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. శుభకార్యం ఏదైనా బంగారానికి పెద్ద పీట వేస్తుంటారు. అంతేకాదు పొదుపు చేసేవారికి సైతం ఓ మంచి సాధనంగా మారింది. అయితే ప్రస్తుతం గోల్డ్ రేట్స్ సామాన్యులకు అందనంటున్నాయి. బంగారం ధరలు రోజు రోజుకు పెరుగుతూ పోతున్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 82వేలు దాటింది. డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం తర్వాత బంగారం ధరలు గరిష్టస్థాయికి చేరాయి. ఇన్వెస్టర్లు స్టాక్‌మార్కెట్‌పైన సెంటిమెంట్‌ దెబ్బతినడంతో తమ పెట్టుబడులను పెద్ద మొత్తంలో బంగారం వైపు మళ్లిస్తున్నారు. దీనికి తోడు ప్రపంచ స్థాయిలో సెంట్రల్ బ్యాంక్‌లు పలు దేశాల్లో బంగారాన్ని కొనుగోలు చేయడంతో.. ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. బంగారం లాగే వెండి ధరలు కూడా పెరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు నేడు అంటే శుక్రవారం (24-01-2025)ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.. గురువారం 24 క్యారెట్ల.. 10 గ్రాముల​ గోల్డ్ రేటు రూ.82,700 ఉండగా, శుక్రవారం రూ.620 తగ్గి రూ.82,080లకు చేరింది. గురువారం నాడు రూ.93,920లు ఉండగా, శుక్రవారం నాడు రూ. 1,03,900లకు చేరుకుంది.

హైదరాబాద్​లో 10 గ్రాముల 24 క్యారెట్​ బంగారం ధర రూ.82,080లుగా ఉంది. కిలో వెండి ధర రూ. 1,03,900కి చేరింది.

విజయవాడలో 10 గ్రాముల 24 క్యారెట్​ బంగారం ధర రూ.82,080లుగా ఉంది. కిలో వెండి ధర రూ. 1,03,900కి చేరింది.

విశాఖపట్నంలో 10 గ్రాముల 24 క్యారెట్​ బంగారం ధర రూ.82,080లుగా ఉంది. కిలో వెండి ధర రూ. 1,03,900కి చేరింది.

పైన ఇచ్చిన ధరలు ఉదయం మార్కెట్​ ప్రారంభంలో నమోదైనవి. ఈ గోల్డ్​, సిల్వర్​ రేట్లు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. కొనేముందు మరోసారి చెక్ చేసుకుంటే మంచిది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..