Gold rates: రెండు నెలల్లో భారీగా తగ్గిన బంగారం.. 10 గ్రాములకు అప్పటికీ ఇప్పటికీ ఎంత తేడా అంటే..

Gold rates: బలహీనమైన అంతర్జాతీయ పరిణామాల మధ్య బంగారం ధరలు తీవ్రంగా ప్రభావితమవుతున్నాయి. రెండు నెలల కాలంలో బంగారం రేటు భారీగానే తగ్గింది. రానున్న కాలంలో వీటి ధరలు ఎలా ఉంటాయో ఇప్పుడు తెలుసుకోండి.

Gold rates: రెండు నెలల్లో భారీగా తగ్గిన బంగారం.. 10 గ్రాములకు అప్పటికీ ఇప్పటికీ ఎంత తేడా అంటే..

Updated on: May 27, 2022 | 4:05 PM

Gold rates: బలహీనమైన అంతర్జాతీయ పరిణామాల మధ్య బంగారం ధరలు తీవ్రంగా ప్రభావితమవుతున్నాయి. అమెరికన్ డాలర్, యూఎస్ బాండ్ ఈల్డ్‌లు ఇటీవలి గరిష్ఠాల నుంచి వెనక్కి తగ్గినప్పటికీ, గ్లోబల్ ఈక్విటీల్లో పుంజుకోవడం తిరిగి బంగారంపై మదుపరుల చూపుకు కారణమౌతోందని విశ్లేషకులు అంటున్నారు. MCXలో బంగారం ఫ్యూచర్స్ 10 గ్రాములకు రూ.50,925 వద్ద ఉండగా, వెండి కిలోకు 0.4% పెరిగి రూ.62,080కి చేరుకుంది. మార్చిలో, ఉక్రెయిన్ సంక్షోభం కారణంగా బంగారం గరిష్ఠంగా రూ.55,600ని తాకింది. ఫెడ్ అందించిన వివరాల ప్రకారం ఆర్థిక పరిస్థితులు బలహీనంగా ఉండటంతో డాలర్ కొంత బలహీనపడింది. పైగా యూఎస్ దిగుమతులు తక్కువగా ఉన్నాయి. ఇలాంటి సందర్భంలో బంగారం, వెండి ధరలు ప్రభావితం చెందుతాయని నిపుణులు అంటున్నారు.

గ్లోబల్ మార్కెట్లలో బంగారం ధరలు 0.2% పెరిగి 1,854 డాలర్ల వద్ద ఉన్నాయి. డాలర్ బలహీనపడటం కొనసాగుతున్నందున విలువైన మెటల్ వరుసగా రెండో వారం కూడా పెరుగుదల కోసం ట్రాక్‌లో ఉంది. ఈ తరుణలో జూన్ గోల్డ్ ఫ్యూటర్స్ ఈ రోజు రూ.50,935 వద్ద ఉండగా.. ఆగస్టు నెలవి రూ.51,080 వద్ద ఉన్నాయి. అదే వెండి విషయానికి వస్తే.. ప్రస్తుతం రూ.62 వేల మార్క వద్ద ఉండి. అదే జూలై సిల్వర్ ఫ్యూచర్స్ రూ.62,202 వద్ద, సెప్టెంబర్ ఫ్యూచర్స్ రూ.62,870 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. పసిడి దాదాపుగా రూ.5000 కంటే ఎక్కువగానే దిగివచ్చింది. వెండి కూడా రెండు నెలల కాలంలో దాదాపు రూ.17 వేలు తగ్గాయి. ఫెడ్ ద్రవ్య విధాన వైఖరి చర్చనీయాంశంగా ఉన్నందున ఇన్వెస్టర్ల చూపు ఈక్విటీ మార్కెట్ల వైపు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఊతంలో మార్కెట్లు రికవరీకి ప్రయత్నిస్తున్నాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

పర్సనల్ ఫైనాన్స్ కు సంబంధించిన ఆసక్తికరమైన వీడియోల వేదిక Money9 Telugu యూట్యూబ్ ఛానెల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి