Purchase Gold: బంగారం కొనుగోలుకూ ని‘బంధనాలు’.. పరిమితికి మించితే ఐడీ ప్రూఫ్ చూపాల్సిందే.. పూర్తి వివరాలు ఇవి..

|

May 27, 2023 | 4:30 PM

బంగారం కొనుగోళ్లపై కూడా నిబంధనలు ఉన్నాయని మీకు తెలుసా? అవునండి ఒక పరిమితి వరకూ పర్వాలేదు గానీ.. ఆ పరిమితి దాటితే మాత్రం తప్పనిసరిగా వినియోగదారుడు తమ ఐడీ ప్రూఫ్.. పాన్ కార్డు లేదా ఆధార్ కార్డు తప్పనిసరిగా చూపించి బంగారాన్ని కొనుగోలు చేయాల్సి ఉంటుంది.

Purchase Gold: బంగారం కొనుగోలుకూ ని‘బంధనాలు’.. పరిమితికి మించితే ఐడీ ప్రూఫ్ చూపాల్సిందే.. పూర్తి వివరాలు ఇవి..
Gold Price Today
Follow us on

బంగారం.. మన సంప్రదాయంలో అధిక ప్రాధాన్యం కలిగిన లోహం. ఏ శుభకార్యమైనా మొదట గుర్తొచ్చేది బంగారమే.. ఇక అక్షయ తృతీయ సమయం, శ్రావణ మాసాల్లో బంగారం కొనుగోళ్లు భారీగా జరుగుతుంటాయి. అయితే బంగారం కొనుగోళ్లపై కూడా నిబంధనలు ఉన్నాయని మీకు తెలుసా? అవునండి ఒక పరిమితి వరకూ పర్వాలేదు గానీ.. ఆ పరిమితి దాటితే మాత్రం తప్పనిసరిగా వినియోగదారుడు తమ ఐడీ ప్రూఫ్.. పాన్ కార్డు లేదా ఆధార్ కార్డు తప్పనిసరిగా చూపించి బంగారాన్ని కొనుగోలు చేయాల్సి ఉంటుంది. మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA), 2002లో రత్నాలు, బంగారు ఆభరణాల కొనుగోళ్లను చేర్చడం ద్వారా కేంద్ర ప్రభుత్వం కఠినమైన నిబంధనలు అమలు చేస్తోంది. ఈ మార్పును ప్రభుత్వం 28 డిసెంబర్ 2020న అధికారికంగా తెలియజేసింది. దీని ప్రకారం నిర్దిష్ట పరిమితిని మించిన నగదు లావాదేవీల కోసం కొనుగోలుదారులు తమ పాన్, ఆధార్ వివరాలను వ్యాపారులు సేకరించాల్సిన అవసరం ఉంటుంది. నగల వ్యాపారులు రూ. 10 లక్షలకు సమానమైన లేదా అంతకంటే ఎక్కువ విలువైన నగదు లావాదేవీలను ప్రభుత్వానికి నివేదించాలి.

2000 నోట్ల ఉపసంహరణతో..

2,000 నోట్ల చలామణిని ఉపసంహరించుకోవాలని భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) తీసుకున్న నిర్ణయం ఫలితంగా బంగారానికి డిమాండ్ పెరిగింది. చాలా మంది వ్యక్తులు ఆ రూ. 2,000 నోట్లను ఉపయోగించి బంగారాన్ని కొనుగోలు చేయడానికి ఎగబడుతున్నారు. ఈ నేపథ్యంలో ఐడీ ప్రూఫ్ లేకుండా ఎంత బంగార కొనుగోలు చేయొచ్చు.. ఐడీ ప్రూఫ్ చూపించి ఎతం బంగారం కొనుగోలు చేయొచ్చు అన్న విషయాలు, వాటి నిబంధనలు తెలుసుకోవడం చాలా ముఖ్యం.

ఇవి పరిమితులు..

ఆదాయపు పన్ను చట్టం, 1961లోని సెక్షన్ 269ఎస్టీ ప్రకారం, ఒక వ్యక్తి ఒకే రోజులో రూ. 2 లక్షలకు మించిన నగదు లావాదేవీ చేయకూడదు. అందువల్ల మీరు ఒకే రోజులో రూ. 2 లక్షలు దాటిన నగదును ఉపయోగించి బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తే, మీరు ఆదాయపు పన్ను నిబంధనలను ఉల్లంఘించినట్లే. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 271డి ప్రకారం, అటువంటి లావాదేవీలో నగదు గ్రహీత నగదు రూపంలో లావాదేవీ జరిపిన మొత్తానికి సమానమైన పెనాల్టీని చెల్లించవలసి ఉంటుంది.

ఇవి కూడా చదవండి

పాన్/ఆధార్ తప్పనిసరి..

అయితే నిపుణులు చెబుతున్న దాని ప్రకారం.. మనీలాండరింగ్ నిరోధక చట్ట నియమాలు పాటిస్తూ కేవైసీ పూర్తి చేసుకున్న వ్యక్తులు అధిక-విలువ నగదు లావాదేవీలలో పాల్గొనడానికి అనుమతి పొందుతున్నారు. ఒక వ్యక్తి రూ. 2 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ విలువైన బంగారు ఆభరణాలను కొనుగోలు చేసినట్లయితే, ఎలక్ట్రానిక్ పద్ధతిలో చెల్లింపు చేసినప్పటికీ, వారు పాన్ లేదా ఆధార్ వివరాలను అందించాలి. అయితే, ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 269ఎస్టీ వ్యక్తులు రూ.2 లక్షలకు మించి నగదు లావాదేవీలు జరపడాన్ని నిషేధిస్తుంది. అందువల్ల, నగదు లేదా ఎలక్ట్రానిక్ లావాదేవీ రూ. 2 లక్షల కంటే తక్కువ ఉంటే కేవైసీ పాటించాల్సిన అవసరం లేదు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..