AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Prices: బంగారం ధరలపై కిక్కిచ్చే న్యూస్.. ఏకంగా రూ.50 వేలు డౌన్.. 18 ఏళ్లల్లో ఇదే తొలిసారి..

బంగారం ధరలు భారీగా పతనమవుతున్నాయి. ఈ నెలలో భారీగా కుప్పకూలాయి. జనవరిలో జీవితకాలపు గరిష్ట స్థాయికి చేరుకోగా.. అక్కడ నుంచి ఈ నెల వరకు భారీగా పడిపోయాయి. 18 ఏళ్లల్లో ఒకే నెలలో భారీగా తగ్గడం ఇదే తొలిసారి అని నిపుణులు చెబుతున్నారు.

Gold Prices: బంగారం ధరలపై కిక్కిచ్చే న్యూస్.. ఏకంగా రూ.50 వేలు డౌన్.. 18 ఏళ్లల్లో ఇదే తొలిసారి..
Gold And Silver Prices
Venkatrao Lella
|

Updated on: Jun 30, 2026 | 8:31 PM

Share

బంగారం ధరలు భారీగా తగ్గుముఖం పడుతున్నాయి. జూన్ నెలలో రికార్డు స్థాయిలో ధరలు పడిపోయాయి. గత రెండేళ్లుగా ధరలు పెరుగుతుండగా.. ఇప్పుడు భారీగా పతనమవుతున్నాయి. జూన్ నెలలో ఏకంగా 12 శాతం మేర కుప్పకూలగా.. ఒకే నెలలో ఇంతలా తగ్గడం 18 ఏళ్లల్లో ఇదే తొలిసారిగా చెబుతున్నారు. చివరిసారిగా 2008లో ఇదే స్థాయిలో బంగారం రేట్లు డౌన్ అవ్వగా.. ఇప్పుడు అదే స్థాయిలో ఒకే నెలలో క్రాష్ అయ్యాయి. ఈ ఏడాది జనవరిలో పసిడి ధరలు ఆల్ టైం రికార్డ్ స్థాయికి చేరుకున్నాయి. 10 గ్రాముల బంగారం ధర రూ.1,92,991కి చేరుకుంది. అక్కడ నుంచి ఈ నెల వరకు చూసుకుంటే రూ.50 వేల మేర ధరలు తగ్గాయని చెప్పవచ్చు.

ప్రస్తుతం 10 గ్రాముల బంగారం ధర రూ.1.42 లక్షల వద్ద ట్రేడవుతోంది. దీంతో జనవరి నుంచి ఇప్పటివరకు ఏకంగా రూ.50 వేలు తగ్గింది. ఆల్ టైం రికార్డ్ స్థాయి నుంచి పతనమవుతూ వస్తోంది. కొనుగోలుదారులకు ఇది మంచి విషయం కాగా.. ఇన్వెస్ట్ చేసేనివారికి మాత్రం నష్టాలు వస్తున్నాయి. బంగారం ధర ఎప్పుడు తగ్గుతుంది.. ఎప్పుడు పెరుగుతుంది అనేది చాలా కష్టం. దీంతో ఇన్వెస్ట్ చేసేముందు ఆలోచించుకోవాలని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. 2008 అక్టోబర్ లో బంగారం ఇదే స్థాయిలో క్రాష్ అయింది. ఆ తర్వాత ఒకే నెలలో భారీగా తగ్గడం 18 ఏళ్లల్లో ఇదే తొలిసారి అని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. డాలర్ బలపడటం, త్వరలో అమెరికా ఫెడ్ రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లను పెంచనుందనే అంచనాల క్రమంలో గోల్డ్ రేట్లు భారీగా తగ్గుతున్నాయి. మంగళవారం స్పాట్ గోల్డ్ రేటు 12 శాతం పడిపోగా.. జూన్ నెలలో 13 శాతం నష్టాన్ని మూటకట్టుకుంది. వరుసగా నాలుగో నెలలో నష్టాలు వచ్చాయి.

ఫెడ్ రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లను పెంచితే పెట్టుబడిదారులు ఫిక్స్ డ్ డిపాజిట్లు, బాండ్ల వైపు మొగ్గు చూపే అవకాశం ఉంటుంది. బంగారం ఎలాంటి క్రమమైన ఆదాయాన్ని ఇవ్వదు. దీంతో వడ్డీ రేట్లు పెరిగితే బంగారం వైపు పెట్టుబడిదారుల చూపు తగ్గుతుంది. ఈ ఏడాదిలో ఫెడ్ రిజర్వ్ బ్యాంక్ మూడుసార్లు వడ్డీ రేట్లను పెంచవచ్చనే అంచనాలు వెలువడుతున్నాయి. సెప్టెంబర్ సమావేశంలో 64 శాతం వరకకు పెంచే అవకాశముందని చెబుతున్నారు. ఇదే జరిగితే బంగారం ధరల్లో భారీ హెచ్చుతగ్గులు చూడవచ్చని నిపుణులు చెబుతున్నారు. అమెరికాలో ద్రవ్యోల్బణం పెరుగుతుంది. దీంతో వడ్డీ రేట్లను పెంచే అవకాశముందని తెలుస్తోంది.

Follow Us