Gold Prices: పండుగ రోజు గోల్డ్ ప్రియులకు శుభవార్త.. ఒక్కసారిగా పడిపోయిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంతంటే..?

వినాయక చవితి పండుగ సందర్భంగా గోల్డ్ ప్రియులకు గుడ్ న్యూస్. పసిడి ధరలు స్వల్పంగా తగ్గాయి. త్వరలో పండుగల సీజన్ రానుండటంతో బంగారం కొనుగోలు చేసేందుకు చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలో ధరలు తగ్గడం భారీ ఊరటగా చెప్పవచ్చు. ప్రస్తుతం ధరలు ఇలా ఉన్నాయి.

Gold Prices: పండుగ రోజు గోల్డ్ ప్రియులకు శుభవార్త.. ఒక్కసారిగా పడిపోయిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంతంటే..?
Gold Prices

Updated on: Sep 14, 2026 | 6:54 AM

బంగారం కొనాలనుకుంటున్నారా..? అయితే శుభవార్త. గోల్డ్ రేట్లు మరింత తగ్గాయి. గత రెండు రోజులుగా కొనసాగుతున్న పెరుగుదలకు ఒక్కసారిగా బ్రేక్ పడింది. అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు తగ్గడంతో.. దేశంలోనూ పతనమయ్యాయి. వారం ప్రారంభంలోనే బంగారం ధరలు కుప్పకూలడంతో కొనుగోలుదారులు ఊరట చెందుతున్నారు. భారతీయులకు బంగారమంటే ఎంత ఇష్టమని తెలిసిందే. గత కొన్ని రోజులుగా బంగారం ధరలలో ఊహించని మార్పులు కనిపిస్తున్నాయి. సోమవారం దేశీయ బులియన్ మార్కెట్లలో పసిడి ధరలు తగ్గడంతో వినియోగదారులు ఊపిరి పీల్చుకున్నారు. సెప్టెంబర్ 14న దేశంలోని వివిధ ప్రధాన నగారాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయనేది ఒకసారి చూద్దాం.

నేటి బంగారం ధరలు ఇవే..

-ప్రస్తుతం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 1,54,570 వద్ద ట్రేడ్ అవుతోంది. అదేవిధంగా 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 1,41,690 వద్ద అమ్ముడవుతోంది.

-చెన్నై మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 1,54,570 వద్ద కొనసాగుతోండగా.. 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 1,41,690 పలుకుతోంది.

-బెంగళూరులో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 1,54,570 వద్ద ట్రేడవుతుండగా.. 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 1,41,690కు లభిస్తోంది.

-దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,54,720 వద్ద ట్రేడవుతుండగా.. 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 1,41,840 వద్ద కొనసాగుతోంది.

-ముంబైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,54,570 వద్ద ట్రేడవుతుండగా.. 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 1,41,690 వద్ద కొనసాగుతోంది.

వెండి రేట్లు ఇవే..

-ఢిల్లీలో కిలో వెండి ధర రూ.2,44,900 వద్ద కొనసాగుతోంది. నిన్న రూ.2.45 లక్షల వద్ద స్థిరపడింది.

-హైదరాబాద్‌లో కేజీ సిల్వర్ ధర రూ.2,49,900గా ఉండగా.. ఆదివారం రూ.2.50 లక్షల వద్ద స్థిరపడింది.

-చెన్నైలో కిలో వెండి ధర రూ.2,49,900 వద్ద కొనసాగుతోండగా.. ఆదివారం రూ.2.50 లక్షల వద్ద స్థిరపడింది.

బెంగళూరలో కేజీ సిల్వర్ ధర రూ.2,44,900 వద్ద కొనసాగుతోంది.

బంగారం ధరల హెచ్చుతగ్గులకు పలు అంతర్జాతీయ కారణాలు దోహదపడుతున్నాయి. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు, క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్ కు 100 డాలర్ల ఎగువకు చేరడం, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల తగ్గింపు వాయిదా పడవచ్చనే అంచనాలు బంగారం ధరలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. డాలర్ విలువ పెరగడంతో పెట్టుబడిదారులు బంగారం కంటే డాలర్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ పరిణామాలు బులియన్ మార్కెట్లో అనిశ్చితికి దారితీస్తున్నాయి.

Loading...
Unable to load recommendations.
Follow Us