Gold Prices: గోల్డ్ ప్రియులకు ఊరట.. మరోసారి ధరలు డౌన్.. సోమవారం తులం ఎంతంటే..?

దేశంలో బంగారం, వెండి ధరలు తగ్గుతున్నాయి. అంతర్జాతీయంగా ధరలు పతనం కావడంతో.. దేశంలోనూ అదే బాట పడుతున్నాయి. గత కొద్ది రోజులుగా ధరలు కుప్పకూలుతూ వస్తోండగా.. సోమవారం కూడా అదే కొనసాగింది. సోమవారం ధరలు స్వల్పంగా తగ్గాయి. దేశంలోని వివిధ నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయంటే..

Gold Prices: గోల్డ్ ప్రియులకు ఊరట.. మరోసారి ధరలు డౌన్.. సోమవారం తులం ఎంతంటే..?
Gold Prices

Updated on: Oct 05, 2026 | 6:33 AM

బంగారం కొనుగోలు చేసేవారికి గుడ్ న్యూస్. గోల్డ్ రేట్లు స్వల్పంగా తగ్గాయి. గత కొద్దికాలంగా గోల్డ్ రేట్లు భారీగా పతనమవుతున్నాయి. ఫెడ్ వడ్డీ రేట్లను పెంచడంతో ప్రభుత్వం బాండ్లకు డిమాండ్ పెరిగింది. ఈ కారణంతో పాటు అమెరికా డాలర్ బలపడటంతో పసిడి ధరలు దిగొస్తున్నాయి. గత రెండు వారాలుగా బంగారం ధరల్లో భారీ పతనం నమోదవుతోంది. దీంతో కొనుగోలుదారులు ఊరట చెందుతున్నారు. త్వరలో పండుగల సీజన్ కావడంతో గోల్డ్ ఎక్కువమంది కొనే అవకాశముంది. ఈ క్రమంలో ధరలు తగ్గడం ఉపశమనంగా చెప్పవచ్చు. అక్టోబర్ 5వ తేదీన సోమవారం దేశంలోని వివిధ ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయనేది చూద్దాం.

గోల్డ్ ధరలు ఇవే..

-దేశీయ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్చమైన మేలిమి బంగారం ధర రూ.1,49,170 వద్ద ట్రేడవుతోండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,36,740గా కొనసాగుతోంది.

-హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,49,170గా ఉండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,36,740 వద్ద కొనసాగుతోంది.

-విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల రేటు రూ..1,49,170 వద్ద ట్రేడవుతోండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,36,740గా ఉంది.

-చెన్నైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ..1,49,170 వద్ద కొనసాగుతోండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,36,740 వద్ద కొనసాగుతోంది.

-బెంగళూరులో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ..1,49,170గా ఉండగా. 22 క్యారెట్ల ధర రూ.1,36,740గా ట్రేడవుతోంది.

-ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ..1,49,320 వద్ద కొనసాగుతోండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,36,890గా ట్రేడవుతోంది.

వెండి రేట్లు ఇవే..

-ఢిల్లీలో కేజీ వెండి ధర రూ.2,34,900 వద్ద ఉండగా.. ఆదివారం రూ.2.35 లక్షలుగా ఉంది.

-హైదరాబాద్‌లో కిలో సిల్వర్ రేటు రూ.2,44,900 వద్ద ఉండగా.. ఆదివారం రూ.2.45 లక్షలుగా ఉంది.

-బెంగళరూలో కిలో వెండి ధర రూ.2,34,900 వద్ద ట్రేడవుతోండగా.. ఆదివారం రూ.2.35 లక్షల వద్ద కొనసాగుతోంది.

-చెన్నైలో కిలో సిల్వర్ రేటు రూ.2,44,900 వద్ద ఉండగా.. ఆదివారం రూ.2.45 లక్షలుగా ఉంది.

Loading...
Unable to load recommendations.
Follow Us