Gold Price Today: స్వల్పంగా పెరిగిన బంగారం ధర.. నిలకడగా వెండి

భారతదేశంలో ప్రజలు బంగారంపై క్రమ పద్ధతిలో పెట్టుబడి పెట్టడం కొనసాగిస్తున్నారు. గ్లోబల్ మార్కెట్ పరిస్థితి, యూఎస్‌ డాలర్ బలంతో సహా అనేక కారణాల వల్ల భారతదేశంలో బంగారం ధరలు మారుతూ ఉంటాయి. తద్వారా స్థానిక మార్కెట్‌లలో డిమాండ్, సరఫరాపై ఆధారపడి నగరం నుండి నగరానికి వివిధ ప్రభావం ఉంటుంది..

Gold Price Today: స్వల్పంగా పెరిగిన బంగారం ధర.. నిలకడగా వెండి
Gold Price Today

Updated on: Oct 19, 2023 | 6:19 AM

అత్యంత విలువైన, ఖరీదైన లోహాలలో ఒకటి బంగారం. భారతదేశంలో చాలా ముఖ్యమైనదిగా పరిగణిస్తారు.మరియు ప్రస్తుత సమయంలో ప్రధాన పెట్టుబడి ఎంపికలలో ఒకటి. ఆభరణాల రూపంలోనే కాదు. కానీ బంగారం కళ, నాణేల రూపాల్లో కూడా విలువైనది. బంగారం ధరలు నిరంతరాయంగా పెరిగినప్పటికీ, భారతదేశంలో ప్రజలు బంగారంపై క్రమ పద్ధతిలో పెట్టుబడి పెట్టడం కొనసాగిస్తున్నారు. గ్లోబల్ మార్కెట్ పరిస్థితి, యూఎస్‌ డాలర్ బలంతో సహా అనేక కారణాల వల్ల భారతదేశంలో బంగారం ధరలు మారుతూ ఉంటాయి. తద్వారా స్థానిక మార్కెట్‌లలో డిమాండ్, సరఫరాపై ఆధారపడి నగరం నుండి నగరానికి వివిధ ప్రభావం ఉంటుంది.

భారతదేశంలో బంగారం ధరలను తెలుసుకునే ముందు, 24 క్యారెట్, 22 క్యారెట్ బంగారం మధ్య వ్యత్యాసాన్ని తెలుసుకోవడం ముఖ్యం. 24-క్యారెట్ బంగారం 100 శాతం స్వచ్ఛమైన బంగారంగా పరిగణిస్తాము.22-క్యారెట్ బంగారంలో వెండి లేదా రాగి వంటి మిశ్రమ లోహాల జాడలు ఉన్నాయి. అలాగే 91.67 శాతం స్వచ్ఛమైన బంగారం ఉంటుంది. అయితే ప్రస్తుతం అక్టోబర్‌ 19వ తేదీన దేశంలో బంగారం ధర స్వల్పంగా పెరిగింది. 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,460 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,500 ఉంది.

యూఎస్‌డీ దిగుమతి ఖర్చులు, బ్యాంకుల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు, ఆర్థిక స్థిరత్వం, కాలానుగుణ ధరలు, ద్రవ్యోల్బణం, డిమాండ్-సప్లయ్‌తో సహా గ్లోబల్ మార్కెట్‌లో హెచ్చుతగ్గులు భారతదేశంలో బంగారం ధరలను ప్రభావితం చేసే అనేక అంశాలు ఉన్నాయి. అధిక ద్రవ్యోల్బణం రేట్లు బంగారం డిమాండ్‌ను పెంచుతాయి. దీనికి విరుద్ధంగా డిమాండ్ పెరుగుదలతో దాని ధర కూడా పెరుగుతుంది. కొన్ని గ్లోబల్ పరిస్థితులతో పాటు బంగారం అంతర్జాతీయ స్పాట్ ధర భారతదేశంలో బంగారం మెటల్ విలువను కూడా ప్రభావితం చేస్తుంది. ఇతర ఉత్పత్తుల మాదిరిగానే, డిమాండ్, సరఫరా కూడా బంగారం ధరలను ప్రభావితం చేస్తాయి. బంగారానికి డిమాండ్‌, సరఫరా పెరగడంతో వాటి ధరలు కూడా పెరిగిపోతున్నాయి.

ఇక తాజాగా దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఇలా..

చెన్నై:

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,660
24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,720

ముంబై:

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,460
24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,500

ఢిల్లీ:

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,610
24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,650

కోల్‌కతా:

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,460
24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,500

బెంగళూరు:

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,460
24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,500

హైదరాబాద్‌:

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,460
24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,500

విజయవాడ:

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,460
24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,500

ఇక దేశంలో వెండి ధరను కూస్తే ప్రస్తుతం స్థిరంగా ఉంది. కిలో వెండి ధర రూ.74,600 వద్ద కొనసాగుతోంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి