Gold Price Today: పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్.. మరోసారి దిగొచ్చిన బంగారం, వెండి ధరలు.. తులం ఎంతంటే?

గత కొన్ని రోజులుగా పెరుగుతూ వచ్చిన బంగారం, వెండి ధరలు రెండు మూడు రోజులుగా వరుసగా తగ్గుముఖం పట్టాయి. తాజాగా సోమవారం ఉదయం కూడా మరోసారి బంగారం, వెండి ధరల్లో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. కాబట్టి దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల సహా తెలుగు రాష్ట్రాల్లో బంగారం వెండి ధరలు, ఎలా ఉన్నాయి. మోదీ బంగారం కొనొద్దని ఎందుకు అన్నారో చూద్దాం.

Gold Price Today: పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్.. మరోసారి దిగొచ్చిన బంగారం, వెండి ధరలు.. తులం ఎంతంటే?
Gold Price Today

Updated on: May 11, 2026 | 6:38 AM

గత కొన్ని నెలలుగా అంతర్జాతీయంగా నెలకొన్ని ఉద్రిక్తలు, డాలర్ విలువ మారకంతో బంగారం, వెండి ధరలో భారీ హెచ్చుతగ్గులు ఏర్పడ్డాయి. ఒకానోక సమయంలో తులం బంగారం ధర ఏకంగా రూ.2లక్షలకు చేరువలోకి వెల్లగా వెండి ధర రూ.4లక్షలకు దగ్గరగా వెళ్లి సమాన్యులకు అందని ద్రాక్షలా మారింది. కానీ తర్వాత నెలకొన్న పరిస్థితుల కారణంగా ఈ రెండు ఆభరణాల ధరలు క్రమంగా తగ్గుముఖం పట్టి ప్రస్తుతం కొనుగోళుదారులకు ఊరట కల్పిస్తున్నాయి. తాజాగా మరోసారి బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు ఔన్స్ కు $4,715 గా ఉంది.

ఇక మన దేశీయ మార్కెట్‌లో చూసుకుంటే ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,52,234గా ఉండగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,39,640 వద్ద ట్రేడవుతుంది. ఇక వెండి కూడా బంగారం బాటలోనే నడుస్తోంది. బంగారం తగ్గిన ప్రతిసారి వెండి కూడా తగ్గుతూ వస్తుంది. ప్రస్తుతం దేశీయ మార్కెట్‌లో కేజీ వెండి ధర రూ.2,74,900 వద్ద ట్రేడవుతుంది.

ఇక దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

  • హైదరాబాద్‌లో బంగారం 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,52,234గా ఉండగా నిన్న ఈ ధర 1,52,650 గా ఉంది. 22 క్యారెట్ల గోల్డ్ 10గ్రాముల ధర రూ.1,39,640 ఉంది. వెండి కిలో ధర రూ.2,62,350గా ఉంది.
  • విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.1,52,234, 22 క్యారెట్ల గోల్డ్ 10గ్రాముల ధర రూ.1,39,640 ఉంది.
  • ముంబైలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,52,234, 22 క్యారెట్ల గోల్డ్ 10గ్రాముల ధర రూ.1,39,640 ఉంది.
  • బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,52,234, 22 క్యారెట్ల గోల్డ్ 10గ్రాముల ధర రూ.1,39,640 ఉంది.
  • కోల్‌కత్తాలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,52,234, 22 క్యారెట్ల గోల్డ్ 10గ్రాముల ధర రూ.1,39,640 ఉంది.
  • చెన్నైలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,54,360,గా ఉండగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,41,490గా ఉంది.
  • ఢిల్లీలో 24 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల ధర రూ.1,52,490, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ1,39,790 వద్ద కొనసాగుతుంది.ఇక వెండి
  • ధరలు చూసుకుంటే దేశీ మార్కెట్‌లో కేజీ వెడి ధర రూ.రూ.2,74,900 గా ఉండగా హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.279,900 గా ఉంది

మోదీ బంగారం కొనొద్దని ఎందుకు అన్నారు.

హైదరాబాద్‌లోని సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగిన బహిరంగ సభలో ప్రధాని మోదీ మాట్లాడుతూ, దేశ ప్రజలు కనీసం ఏడాది పాటు బంగారం కొనడం ఆపేయాలని కొరారు. ఆయన ఇలా అనడానికి ప్రధానంగా దేశ ఆర్థిక ప్రయోజనాలు, అంతర్జాతీయ పరిస్థితులు కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యంగా దేశీ మారక ద్రవ్య నిల్వలను కాపాడుకోవడం, వాణిజ్య లోటును తగ్గించడం, అంతర్జాతీయ ఉద్రిక్తతల నేపథ్యంలో ఆయన ఈ మాటలు చెప్పినట్టు తెలుస్తోంది.

Follow Us