Gold Price Today: పరుగులు పెడుతున్న బంగారం ధర.. హైదరాబాద్‌తో పాటు వివిధ ప్రధాన నగరాల్లో ధరల వివరాలు

Gold Price Today: బంగారం కొనుగోలు చేసేవారికి షాకింగ్‌ న్యూస్‌.. రోజురోజుకు బంగారం ధర పెరిగిపోతోంది. గత రెండు నెలల కిందట కింది చూపులు చూసిన బంగారం.. ఇప్పుడు పై..

Gold Price Today: పరుగులు పెడుతున్న బంగారం ధర.. హైదరాబాద్‌తో పాటు వివిధ ప్రధాన నగరాల్లో ధరల వివరాలు
Gold Price

Updated on: Jun 04, 2021 | 6:39 AM

Gold Price Today: బంగారం కొనుగోలు చేసేవారికి షాకింగ్‌ న్యూస్‌.. రోజురోజుకు బంగారం ధర పెరిగిపోతోంది. గత రెండు నెలల కిందట కింది చూపులు చూసిన బంగారం.. ఇప్పుడు పై చూపులు చూస్తోంది. రోజురోజుకు ఆగకుండా పరుగులు పెడుతోంది. తాజాగా దేశీయంగా పరిశీలిస్తే బంగారం ధర స్వల్పంగా పెరిగింది. అంటే 10 గ్రాములపై 100 రూపాయలు పెరిగింది. కొన్ని ప్రాంతాల్లో ఈ పెరుగుదల ఉంటే మరి కొన్ని ప్రాంతాల్లో నిలకడగా ఉంది. తాజాగా శుక్రవారం దేశంలోని ప్రధాన నగరాల్లో నమోదైన ధరల వివరాలు ఇలా ఉన్నాయి.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,100 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,350 ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,550 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,790 వద్ద ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,230 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,230 ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,100 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,450 ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,200 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,400 ఉంది. అలాగే కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,200 ఉండగా,24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,400 ఉంది.

ఇక హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,200 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,400 ఉంది. ఇక విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,200 ఉండగా,24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,400 వద్ద ఉంది.

కాగా, శుక్రవారం ఉదయం ఉన్న ధరలు ఇవి. బంగారం ధరల్లో ప్రతి రోజు మార్పులు చేర్పులు జరుగుతూనే ఉన్నాయి. గత రెండు నెలల కిందట తగ్గుముఖం పట్టిన పసిడి ధర.. మే నెల నుంచి పరుగులు పెట్టి కాస్త తగ్గుముఖం పట్టగా, ఇప్పుడు తాజాగా జూన్‌ నెల నుంచి మళ్లీ పై చూపులు చూస్తోంది. బంగారం ధరలు పెరగడానికి ఎన్నో కారణాలున్నాయంటున్నారు వ్యాపారవేత్తలు. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం ధరలపై ప్రభావం చూపుతాయని వెల్లడిస్తున్నారు. బంగారం కొనుగోలు చేసే వారు ఆ సమయంలో ధర ఎంత ఉందో తెలుసుకొని వెళ్లడం బెటర్‌. అంతేకాదు.. ప్రస్తుతం 50వేలకుపైగా చేరిన పసిడి.. మున్ముందు మరింత పెరిగే అవకాశాలున్నాయంటున్నారు నిపుణులు.

ఇవీ కూడా చదవండి:

Post Office: పోస్టాఫీస్‌లో అద్భుతమైన స్కీమ్‌.. రూ.10 వేలు ఇన్వెస్ట్‌ చేస్తే.. చేతికి రూ.16 లక్షలు

Indian Railways Records: కరోనా మహమ్మారి సమయంలో సరుకుల రవాణాలో రికార్డు సృష్టించిన భారత రైల్వే శాఖ

Loading...
Unable to load recommendations.
Follow Us