Gold Price Today: బంగారం ప్రియులకు శుభవార్త.. తగ్గుతున్న పసిడి ధరలు.. హైదరాబాద్‌లో మాత్రం భారీగా తగ్గింది

|

Jun 18, 2021 | 6:44 AM

Gold Price Today: దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ విజృంభించి ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతోంది. ఈ తరుణంలో కూడా పసిడి ధరలు మాత్రం పెరుగుతుండగా, ప్రస్తుతం తగ్గుముఖం..

Gold Price Today: బంగారం ప్రియులకు శుభవార్త.. తగ్గుతున్న పసిడి ధరలు.. హైదరాబాద్‌లో మాత్రం భారీగా తగ్గింది
Gold Price Today
Follow us on

Gold Price Today: దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ విజృంభించి ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతోంది. ఈ తరుణంలో కూడా పసిడి ధరలు మాత్రం పెరుగుతుండగా, ప్రస్తుతం తగ్గుముఖం పడుతోంది. తాజాగా శుక్రవారం పసిడి ధరలు దిగి వచ్చాయి. బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటాయన్న విషయం అందరికీ తెలిసిందే. ఒక రోజు ధరలు తగ్గితే.. మరొకరోజు పెరుగుతుంటాయి. అందుకే బంగారం కొనుగోలు చేసే వారంతా ఆసక్తితో బులియన్ మార్కెట్ వైపు దృష్టి పెడుతుంటారు. అయితే.. తాజాగా బంగారం ధరలు స్వల్పంగా తగ్గుముఖం పడుతున్నాయి. ఇక తాజాగా 10 గ్రాముల బంగారంపై వంద రూపాయల లోపు తగ్గగా, హైదరాబాద్‌, ఢిల్లీలో మాత్రం రూ.600 వరకు తగ్గుముఖం పట్టింది. బెంగళూరులో రూ.500 వరకు తగ్గింది. ఇక తాజాగా దేశీయంగా ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,900 ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,150 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,250 ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,350 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,350 వద్ద ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,190 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,890 ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,850 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,930 ఉంది. కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,850 ఉండగా, 24 క్యారట్ల 10 గ్రాముల ధర రూ.48,930 ఉంది.

ఇక హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,850 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,930 ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,850 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,930 ఉంది.

అయితే శుక్రవారం ఉదయం ఉన్న ధరలు ఇవి. ధరల్లో ప్రతి రోజు మార్పులు చేర్పులు జరుగుతూనే ఉన్నాయి. అయితే బంగారం ధరలు పెరగడానికి ఎన్నో కారణాలున్నాయంటున్నారు బులియన్‌ మార్కెట్‌ నిపుణులు. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం ధరలపై ప్రభావం చూపుతాయని వెల్లడిస్తున్నారు. బంగారం కొనుగోలు చేసే వారు ఆ సమయంలో ధర ఎంత ఉందో తెలుసుకొని వెళ్లడం మంచిది.

ఇవీ కూడా చదవండి:

Aadhaar Update: ఆధార్‌ కార్డులో పేరు, ఇతర వివరాలు మార్చాలనుకుంటే ఎలాంటి డాక్యుమెంట్లు కావాలి..?

Cooking Oil Price: సామాన్యులకు గుడ్‌న్యూస్‌.. దిగి వచ్చిన వంట నూనె ధరలు.. ప్రకటించిన కేంద్రం ప్రభుత్వం