Gold and Silver Latest Prices: ప్రపంచవ్యాప్తంగా బంగారం, వెండికి ఎప్పుడూ డిమాండే ఉంటుంది. పెళ్లిళ్లు, శుభకార్యాలు, పండుగలు ఇలా ఎలాంటి కార్యక్రమాలున్నా బంగారాన్ని చాలా మంది కొనుగోలు చేస్తుంటారు. అయితే, ప్రపంచవ్యాప్తంగా, దేశీయంగా చోటుచేసుకుంటున్న పరిణామాల ప్రకారం.. బంగారం, వెండి ధరల్లో మార్పులు, చేర్పులు జరుగుతుంటాయి. నిన్న బంగారం, వెండి ధరలు తగ్గగా.. తాజాగా.. రేట్లు పెరిగాయి. ఆదివారం ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.250 మేర పెరిగి రూ.55,350 కి చేరింది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.270 మేర పెరిగి రూ.60,380 గా ఉంది. కిలో వెండి ధర రూ.600 మేర పెరిగి రూ.77,000 లుగా ఉంది.
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.55,500 లు ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.60,530 గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,350, 24 క్యారెట్ల ధర రూ.60,380 గా ఉంది. చెన్నైలో 22 క్యారెట్లు రూ.55,650, 24 క్యారెట్లు రూ.60,710 ఉండగా.. బెంగళూరులో 22 క్యారెట్లు రూ.55,350, 24 క్యారెట్లు రూ.60,380 గా ఉంది. తెలుగు రాష్ట్రాలు.. హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,350 ఉండగా.. 24క్యారెట్ల బంగారం ధర రూ.60,380 గా ఉంది.
ఢిల్లీలో కిలో వెండి ధర రూ.77,000 లు ఉంది. ముంబైలో రూ.77,000, చెన్నైలో రూ.80,000, బెంగళూరులో రూ.75,500 లుగా ఉంది. హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడలో కిలో వెండి ధర రూ.80,000 లుగా కొనసాగుతోంది.
గమనిక.. బంగారం, వెండి ధరలు బులియన్ మార్కెట్ వెబ్సైట్ లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి.. అయితే, ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు, చేర్పులు జరిగే అవకాశం ఉంటుంది గమనించగలరు..
మరిన్ని బిజినెస్ వార్తల కోసం..