Gold Price Today: మళ్లీ షాకిచ్చిన బంగారం.. ఒక్కరోజులోనే భారీగా పెరిగిన ధరలు.. తులం ఎంత ఉందంటే..

భారతీయులకు బంగారం అంటే ఎంతో ఆసక్తి ఉంటుందన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కావడంతో పసిడి కొనుగోలు చేసేందుకు ముందుకు వస్తున్నారు. కానీ ఈ సమయంలోనే సామాన్యులకు షాకిస్తున్నాయి బంగారం ధరలు. కొన్ని రోజులుగా పరుగులు పెడుతూ ఊహించని విధంగా ధరలలో మార్పు చోటు చేసుకుంటుంది.

Gold Price Today: మళ్లీ షాకిచ్చిన బంగారం.. ఒక్కరోజులోనే భారీగా పెరిగిన ధరలు.. తులం ఎంత ఉందంటే..
Gold

Updated on: May 09, 2025 | 7:46 AM

బంగారం ధరలు మళ్లీ షాకిస్తున్నారు. గత నాలుగు రోజుల క్రితం నెమ్మదిగా తగ్గుతూ వచ్చిన పసిడి.. ఇప్పుడు ఊహించని విధంగా పెరిగింది. నిన్న ఒక్క గోల్డ్ రేట్స్ లో మార్పులు జరగ్గా.. ఈరోజు అంటే శుక్రవారం ఉదయం స్వల్పంగా పెరిగాయి. దేశీయ మార్కెట్లో శుక్రవారం ఉదయం 7 గంటల సమయానికి 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ.91,310 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 99,610కు చేరింది. దీంతో అటు దేశంలోని పలు ప్రధాన నగరాల్లోనూ బంగారం ధరలలో మార్పులు చోటు చేసుకున్నాయి. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం వంటి ప్రాంతాల్లోనూ పసిడి ధరలు భారీగా పెరిగాయి.

శుక్రవారం ఉదయం హైదరాబాద్‏లో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ.91,310 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ.99,610కు చేరింది. అలాగే విజయవాడ, విశాఖపట్నం, వరంగల్, నిజామాబాద్ వంటి ప్రాంతాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. ఇక దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ.91,460 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ.99,610కు చేరింది. అలాగే ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రూ.91,310 చేరగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ.99,760కు చేరింది. ఇక బెంగుళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 91,310 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ.99,610 వద్ద కొనసాగుతుంది. అలాగే చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి రూ.91,310కు చేరగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ.99,610కు చేరింది.

వెండి ధరలు..

హైదరాబాద్‏లో కిలో వెండి ధర రూ.1,10,900

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..