Gold Price Today: దేశ మార్కెట్లో గత కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చిన పసిడి ధరలు.. మంగళవారం ఉదయం స్వల్పంగా పెరిగాయి. నిన్నటి ధరలతో పోలీస్తే పుత్తడి రేట్లు ఇవాళ రూ.10 పెరిగింది. ఇక గత కొన్ని రోజులుగా వస్తున్న ఈ ధరలతో బంగారం కొనాలనుకునే వారికి కాస్త ఊరట కలిగించే విషయమనే చెప్పుకోవాలి. దేశీయ మార్కెట్లో ఈరోజు ఉదయం 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ.46,360కు చేరింది. దీంతోపాటు 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ.47,360 ఉంది.
ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలలో కూడా స్వల్పంగా మార్పులు జరిగాయి. దేశ ఆర్థిక రాజధాని అయిన ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ.46,360గా ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల రేటు రూ.47,360గా చేరింది. హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల పుత్తడి రేటు రూ.44,060కు చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ.47,070గా ఉంది. ఇక విజయవాడ, విశాఖపట్నం మార్కెట్లలో 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ.44,060 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల రేటు రూ.48,070కు చేరింది. ఇదిలా ఉంటే దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల పుత్తడి ధర రూ.46,190 దగ్గరగా చేరగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల రేటు మాత్రం రూ.50,390 స్థాయికి చేరింది. చెన్నై మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ.44,650కు ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ.48,710కు చేరింది. ఇకపోతే బంగారం ధరపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్లలో పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెల్లరీ మార్కెట్ ఇలాంటి అంశాలన్ని పసిడి రేట్లపై ప్రభావాన్ని చూపుతాయి.
Also Read: Gold Rate Today: పెరిగిన పుత్తడి ధర…. తులం విలువ ఎంతంటే..? ఏ నగరంలో ఎంత ధరో తెలుసా..?