
Gold Price Today: బంగారం, వెండి ధరలు కొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. అయితే, శుక్రవారం అవి గణనీయంగా తగ్గాయి. 24 గంటల్లో వెండి కిలోకు ఏకంగా రూ.85,000 వరకు తగ్గింది. గురువారం కిలోకు రూ.4.20 లక్షలకు చేరుకున్న తర్వాత, శుక్రవారం మధ్యాహ్నం 3:30 గంటలకు MCX మార్చి ఫ్యూచర్స్ వెండి రూ.3.35 లక్షలకు పడిపోయింది.
ఇంతలో శుక్రవారం బంగారం ధర కూడా గణనీయంగా పడిపోయింది. 10 గ్రాములకు రూ.193,096 గరిష్ట స్థాయికి చేరుకున్న తర్వాత బంగారం రూ.25,500 తగ్గి రూ.167,406కి చేరుకుంది. ఇక దేశీయంగా బంగారం, వెండి ధరలను చూస్తే.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,69,190 వద్ద ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,55,090 ఉంది.
ప్రస్తుతం దేశీయ మార్కెట్లో కిలో వెండి ధర రూ.3,95,000 వద్ద ట్రేడవుతోంది. హైదరాబాద్‌లో మాత్రం కాస్త ఎక్కువగానే ఉంది. ఇక్కడ రూ.4,0,900 వద్ద ట్రేడవుతోంది. అయితే ప్రతి రోజు ఉదయం 10-11 గంటల సమయాల్లో బంగారం, వెండి ధరలు అప్‌డేట్ అవుతుంటాయి. ఆ సమయంలో ధరలు మరింత తగ్గే అవకాశాలు ఉన్నాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి