Gold Rate Today : తగ్గిన బంగారం ధరలు.. హైదరాబాద్‏లో తులం ఎంత ఉందంటే..

కొన్ని రోజులుగా పరుగులు పెడుతున్న బంగారం ధరలు ఇప్పుడు దిగివస్తున్నాయి. కొన్ని రోజుల క్రితం లక్షకు చేరిన గోల్డ్ రేట్ ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పట్టింది. దీంతో బంగారం కొనుగోలు చేయాలనుకునేవారికి ఇది శుభసూచికమే. మే 1న గురువారం నాడు దేశీయ మార్కెట్లో పసిడి ధరలు స్వల్పంగా తగ్గాయి. దీంతో ఇటు దేశంలోని పలు ప్రధాన నగరాల్లోనూ బంగారం ధరలలో మార్పులు చోటు చేసుకున్నాయి.

Gold Rate Today : తగ్గిన బంగారం ధరలు.. హైదరాబాద్‏లో తులం ఎంత ఉందంటే..

Updated on: May 01, 2025 | 6:48 AM

బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. కొన్ని రోజుల క్రితం 24 క్యారెట్ల గోల్డ్ రేట్ లక్షకు చేరిన సంగతి తెలిసిందే. కానీ ఇప్పుడిప్పుడే పసిడి ధరలు నెమ్మదిగా తగ్గుతున్నాయి. నిన్న అంటే ఏప్రిల్ 30 అక్షయ తృతియ సందర్భంగా 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ.95,8000కి చేరింది. ఇక ఈరోజు సైతం బంగారం కొనుగోలు చేయాలనుకుంటున్న వారికి మరోసారి శుభవార్త. మే 1న గురువారం నాడు 24 క్యారెట్ల పసిడి ధరలు మరింత తగ్గాయి. గురువారం తెల్లవారుజామున దేశీయ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ.89,740గా ఉంది. అలాగే 10 గ్రాముల 24 క్యారెట్ల పసడి ధర రూ. 97,900కు చేరింది.

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు..

మే 1న గురువారం ఉదయం హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 89,740గా ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 97,900 వద్ద కొనసాగుతుంది. అలాగే విజయవాడ, విశాఖపట్నం, వరంగల్, నిజామాబాద్ వంటి ప్రాంతాల్లోనూ ఇవే బంగారం ధరలు కొనసాగుతున్నాయి.

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..

ఈరోజు ఉదయం (మే 1న) చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.89,740గా ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ.97,900గా ఉంది. అలాగే దేశీయ ఆర్థిక రాజధాని ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ.89,740ఉంది. అలాగే 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ.97,900 వద్ద కొనసాగుతుంది. ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ.89,890కు చేరగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ.98,030కు చేరింది. అలాగే బెంగుళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.89,740 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 97,900కు చేరింది. కోల్ కత్తాలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ.89,740కు చేరగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ.97,900గా ఉంది. నిన్న అక్షయ తృతియ రోజుతో చూసుకుంటే ఈరోజు పసిడి ధరలు స్వల్పంగా తగ్గాయి.

మరోవైపు వెండి ధరలు కూడా తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుతం కిలో వెండి రూ.99,900 వద్ద కొనసాగుతుంది. ఢిల్లీ, ముంబై, కోల్‌కతాలో కిలో వెండి ధర రూ.99,900గా ఉండగా, చెన్నై, హైదరాబాద్‌లలో కిలో వెండి ధర రూ.1,08,900గా ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..