Gold Price Today: మహిళలకు దిమ్మదిరిగే షాక్‌.. మళ్లీ లక్ష రూపాయలకు చేరుకున్న బంగారం ధర

Gold Price Today: భారతదేశంలో బంగారం ధర 10 గ్రాములకు రూ. 56,000 కు పడిపోతుంది. మిల్స్ తన అంచనా వెనుక కొన్ని కారణాలను వివరించారు. అతి పెద్ద కారణం బంగారం సరఫరా అధికంగా ఉండటం. ఏదైనా వస్తువు సరఫరా పెరిగినప్పుడు..

Gold Price Today: మహిళలకు దిమ్మదిరిగే షాక్‌.. మళ్లీ లక్ష రూపాయలకు చేరుకున్న బంగారం ధర

Updated on: Jun 06, 2025 | 6:36 AM

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మళ్లీ కొత్త మలుపు తిరిగింది. రెండు దేశాల పరిస్థితి మెరుగుపడటానికి బదులుగా మరింత దిగజారుతోంది. అటువంటి పరిస్థితిలో, ప్రపంచ స్థాయిలో పెరుగుతున్న ఉద్రిక్తత కారణంగా అంతర్జాతీయ మార్కెట్లు ప్రభావితమయ్యాయి. పెట్టుబడిదారులు సాంప్రదాయ సురక్షిత పెట్టుబడుల వైపు మొగ్గు చూపుతున్నారు. దీని కారణంగా బంగారం ధరలు పెరుగుతున్నాయి. అదే సమయంలో బంగారం పెట్టుబడిదారులకు ఇష్టమైన ఎంపికగా మారింది. వెండి ధరలు మళ్లీ పెరిగాయి. నేడు 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు నిన్నటి ధరలతో పోల్చితే సుమారు 400 వరకు ఎగబాకింది. ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగార ధర 99,610 రూపాయల వద్ద కొనసాగుతోంది. అయితే కొన్ని ప్రాంతాల్లో మాత్రం లక్ష రూపాయల వరకు వెళ్లింది. ఇప్పుడు తులం బంగారాన్ని కొనుగోలు చేసినట్లయితే జీఎస్టీ, ఇతర ఛార్జీలతో కలిపి లక్ష రూపాయలు దాటుతుంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 91,130 రూపాయల వద్ద ఉంది. అదే అదే సమయంలో వెండి కూడా కిలోకు భారీగానే పెరిగింది. నిన్న ఒక్క రోజు రూ.3 వేలకపైగా పెరిగింది. ప్రస్తుతం కిలో సిల్వర్‌ ధర రూ.1,14,100కు చేరుకుంది.

చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.99,610 రూపాయలు ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 91,310 రూపాయల వద్ద కొనసాగుతుంది. ఇక ముంబైలో 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.99,610 రూపాయలు ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 91,130 వద్ద ఉంది. ఇక హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర 99,610 రూపాయలు ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 91,130 రూపాయల వద్ద ఉంది.

పెట్టుబడిదారులకు గొప్ప రాబడిని ఇచ్చిన బంగారం పరిస్థితి భవిష్యత్తులో బలహీనంగా ఉండబోతోంది. బంగారం రెండు నెలల్లో కుప్పకూలిపోతుందని భావిస్తున్నారు. దాని ధర 12-15 శాతం తగ్గనుందని ఆర్థిక వేత్తలు చెబుతున్నారు. క్వాంట్ మ్యూచువల్ ఫండ్ ఈ అంచనా వేసింది. అయితే, గత కొన్ని రోజులుగా బంగారం గొప్ప రికవరీని చూసింది.

మార్నింగ్‌స్టార్ విశ్లేషకుడు మిల్స్ అంచనా నిజమైతే, భారతదేశంలో బంగారం ధర 10 గ్రాములకు రూ. 56,000 కు పడిపోతుంది. మిల్స్ తన అంచనా వెనుక కొన్ని కారణాలను వివరించారు. అతి పెద్ద కారణం బంగారం సరఫరా అధికంగా ఉండటం. ఏదైనా వస్తువు సరఫరా పెరిగినప్పుడు దాని ధర తగ్గుతుంది. ఇది బంగారానికి కూడా వర్తిస్తుంది. బంగారం ధర తగ్గితే, అది భారతదేశంలోని ప్రజలకు శుభవార్త అవుతుంది. ఎందుకంటే భారతదేశంలో వివాహాలలో బంగారాన్ని బహుమతిగా ఇచ్చే సంప్రదాయం ఉంది.

ఇది కూడా చదవండి: Britannia Biscuits: ఇక బ్రిటానియా బిస్కెట్ల తయారీ ఫ్యాక్టరీ మూతపడనుందా? కారణం ఏంటి?

ఇది కూడా చదవండి: World’s Longest Road: ప్రపంచంలోనే అతి పొడవైన రోడ్డు.. ఎలాంటి యూ-టర్న్‌ లేకుండా 14 దేశాల గుండా..

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి