Gold Price Today: గోల్డ్ లవర్స్ ఇక కొనేసేయండి.. బంగారం ధర తగ్గిందోచ్.. ఎంతంటే.?

గోల్డ్ ధరలు భారీగా పెరుగుతూపోగా.. నిన్న అనగా గురువారం బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. మరి హైదరాబాద్‌లో ఇవాల్టి బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే.. ఆ ధరలు ఇప్పుడు ఈ స్టోరీలో ఇప్పుడు తెలుసుకుందామా. ఓ సారి లుక్కేయండి మరి చూసేద్దాం.

Gold Price Today: గోల్డ్ లవర్స్ ఇక కొనేసేయండి.. బంగారం ధర తగ్గిందోచ్.. ఎంతంటే.?
Gold Silver Price

Updated on: May 23, 2025 | 10:01 AM

గోల్డ్ లవర్స్ ఇది వినండి.. గత కొద్దిరోజులుగా బంగారం ధరలు దోబూచులాడుతున్నాయ్. కొద్దిరోజులు బంగారం ధరలు భారీగా పెరుగుతూపోతుంటే.. మరికొద్ది రోజులు తగ్గుముఖం పడుతున్నాయి. వరుసగా రెండు రోజులు రూ. 2650 మేరకు స్వచ్చమైన బంగారం ధర.. నిన్న(గురువారం) స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 350 మేరకు తగ్గితే.. 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 380 మేరకు తగ్గింది. అటు వెండి ధరలు కూడా బంగారం బాటలోనే పయణిస్తున్నాయి. సిల్వర్ రేట్లు భారీగా తగ్గాయి.

చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 97,530గా ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 89,400గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 89,400గా ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 97,530గా ఉంది. అటు హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 97,530గా ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 89,400గా ఉంది.

సిల్వర్ రేట్లు..

బంగారం బాటలోనే వెండి ధరలు భారీగా తగ్గాయి. గత రెండు రోజులుగా సుమారు రూ. 4 వేల మేరకు పెరిగిన వెండి ధర.. నిన్న(గురువారం) రూ. 1000 మేరకు తగ్గింది. ముంబై, ఢిల్లీ, కోల్‌కతా నగరాల్లో కేజీ వెండి ధర రూ. లక్ష ఉండగా.. చెన్నై, హైదరబాద్, కేరళ, విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి రూ. 1,11,000గా ఉంది.