Gold Price Today: వామ్మో తగ్గేదేలే అంటున్న బంగారం ధరలు.. లక్షకు చేరువలో..

Gold Price Today: బంగారం ధరలు ఒక రోజు తగ్గితే మరో రోజు పెరుగుతుంటుంది. మన భారతీయ సాంప్రదాయంలో మహిళలు బంగారానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుంటారు. అయితే గత రెండు రోజుల కిందట బంగారం ముట్టుకుంటే భగ్గుమంది. ఎందుకంటే బంగారం ధర..

Gold Price Today: వామ్మో తగ్గేదేలే అంటున్న బంగారం ధరలు.. లక్షకు చేరువలో..

Updated on: Jun 07, 2025 | 6:32 AM

ట్రంప్​ టారీఫ్​ ప్రకటనలు, అమెరికా- చైనా మధ్య అనిశ్చితి, ఫెడ్​ వడ్డీ రేట్లు, ఆర్బీఐ వడ్డీ రేట్ల కోత వంటి అంశాలు పసిడి ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. అయితే బంగారం ధరలు ఒక రోజు తగ్గితే మరో రోజు పెరుగుతుంటుంది. మన భారతీయ సాంప్రదాయంలో మహిళలు బంగారానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుంటారు. అయితే గత రెండు రోజుల కిందట బంగారం ముట్టుకుంటే భగ్గుమంది. ఎందుకంటే బంగారం ధర లక్ష రూపాయలను దాటేసింది. ఐతే వచ్చే రెండు నెలల్లో బంగారం ధరలు తగ్గొచ్చు అంటూ క్వాంట్‌ మ్యూచువల్‌ ఫండ్‌ అంచనా వేసింది. ప్రస్తుతం జూన్‌ 7న తులం బంగారం పై స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. కేవలం పది రూపాయలు మాత్రమే తగ్గి దేశీయంగా తులం బంగారం ధర రూ.99,590 వద్ద ఉంది. అయితే బంగారం ధర కొనుగోలు చేస్తే మాత్రం తులంపై లక్ష రూపాయలు దాటుతుంది. ఎందుకంటే అందులో జీఎస్టీ, ఇతర ఛార్జీలు ఉంటాయి. వాటన్నింటిని కలిసితే లక్షా దాటుతుందని

  1. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.99,590 ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.91,290 వద్ద కొనసాగుతోంది.
  2. ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.99,740 ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.91,140 వద్ద కొనసాగుతోంది.
  3. ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.99,590 ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.91,290 వద్ద కొనసాగుతోంది.
  4. చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.99,590 ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.91,290 వద్ద కొనసాగుతోంది.
  5. ఇవి కూడా చదవండి
  6. బెంగళూరులో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.99,590 ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.91,290 వద్ద కొనసాగుతోంది.
  7. విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.99,590 ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.91,290 వద్ద కొనసాగుతోంది.
  8. ఇక వెండి విషయానికొస్తే కిలో వెండిపై స్వల్పంగా అంటే వంద రూపాయలు పెరిగింది. ప్రస్తుతం కిలో వెండి ధర లక్షా 7 వేల రూపాయలు ఉంది.

మీరు బంగారం కొన్నప్పుడల్లా దాని స్వచ్ఛతను తనిఖీ చేయడం చాలా ముఖ్యం. అంతర్జాతీయ ప్రమాణీకరణ సంస్థ బంగారం స్వచ్ఛతను ధృవీకరించడానికి హాల్‌మార్క్‌ను ఉపయోగిస్తుంది. ఈ హాల్‌మార్క్ మీ బంగారంలో ఎన్ని క్యారెట్ల బంగారం ఉందో మీకు తెలియజేస్తుంది. 24 క్యారెట్ బంగారు ఆభరణాలపై 999, 23 క్యారెట్‌పై 958, 22 క్యారెట్‌పై 916, 21 క్యారెట్‌పై 875, 18 క్యారెట్‌పై 750 అని రాసి ఉంటుంది. చాలా వరకు బంగారం 22 క్యారెట్లలో అమ్ముతారు. కొంతమంది 18 క్యారెట్‌ను కూడా ఉపయోగిస్తారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి