
బంగారం ధరలు రోజురోజుకు ఎగబాకుతున్నాయి. ఒక రోజు తగ్గితే మరో రోజు అంతకు రెండింతలు పెరుగుతోంది. తాజాగా నిన్న రూ.98,850 ఉన్న బంగారం ధర ప్రస్తుతం లక్షకు చేరువలో కొనసాగుతోంది. జూన్ 4 బుధవారం రూ.99,070 వద్ద ఉంది ఇక వెండి ధర విషయానికొస్తే లక్షా 200 రూపాయలు ఉంది. ధరలు ఉదయం 6 గంటలకు నమోదైనవి మాత్రమే. రోజులో పెరగవచ్చు.. తగ్గవచ్చు లేదా స్థిరంగా కొనసాగవచ్చు. దేశంలోని ప్రధాన నగరాల్లో ధరల వివరాలు తెలుసుకుందాం.
అంతర్జాతీయ మార్కెట్‌లో బులియన్ మార్కెట్ రేట్లు మన దేశంలో బంగారం ధరలపై ప్రభావం చూపుతాయి. ఇంకా అమెరికా డాలర్, రూపాయి మారక విలువ కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది. భౌగోళిక ఉద్రిక్త పరిస్థితులు కూడా బంగారం ధరలను నిర్ణయిస్తాయి. అందుకే గోల్డ్ ధరలు స్థిరంగా ఉండవు. ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి.
ఇది కూడా చదవండి: Vehicle Number Plate: నంబర్ ప్లేట్ల రంగుల రహస్యం.. తెలుపు, పసుపు, ఆకుపచ్చ నంబర్ల అర్థం ఏంటో తెలుసా..?
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి